జాతీయ వార్తలు

అఫ్గాన్ పార్లమెంటు వద్ద జంట బాంబు పేలుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, జనవరి 10: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ మంగళవారం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. పార్లమెంటు భవనం సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన జంట బాంబు పేలుళ్లలో 21 మంది చనిపోగా, మరో 45 మంది గాయపడ్డారు. తొలుత పార్లమెంటు ప్రవేశద్వారం వద్ద ఓ వ్యక్తి ఆత్మాహుతికి పాల్పడగా, ఘటనాస్థలానికి కొద్దిదూరంలో రోడ్డుకు ఆవలి వైపున మరో కారుబాంబు పేలుడు చోటుచేసుకుంది. పార్లమెంటులో పనిచేసే ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లు జరిగాయి. ‘పార్లమెంటు వెలుపల తొలి పేలుడు సంభవించింది. కాలినడకన వచ్చిన మానవ బాంబు కారణంగా జరిగిన ఈ పేలుడు జరిగింది’ అని ఈ సంఘటనలో గాయపడ్డ జబి అనే సెక్యూరిటీ గార్డు ఎఎఫ్‌పి వార్తాసంస్థకు తెలిపారు. రెండోది కారుబాంబు అని, రోడ్డుకు ఆవలి వైపున దాన్ని నిలిపి ఉంచారని ఆయన చెప్పాడు. ఈ జంట పేలుళ్లలో 21 మంది మృతి చెందగా, 45 మంది గాయపడ్డారని, వీరిలో ఎక్కువమంది సాధారణ పౌరులు, పార్లమెంటు ఉద్యోగులు ఉన్నారని భద్రతా అధికారి ఒకరు చెప్పారు. కాగా, గాయపడిన దాదాపు 70 మందిని ఆస్పత్రులకు తరలించినట్లు ఆరోగ్య శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఘటనా స్థలమంతా మృతదేహాలు, క్షతగాత్రులతో భీతావహంగా కనిపించింది. కాగా, అఫ్గానిస్థాన్ ప్రధాన ఇంటెలిజన్స్ ఏజన్సీకి చెందిన వాహనాన్ని టార్గెట్‌గా చేసుకుని తాము ఈ దాడి చేసినట్లు తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ చెప్పారు. అంతకు ముందు మంగళవారం ఉదయం హెల్మండ్ రాష్ట్ర రాజధాని లష్కర్‌గాహ్ ప్రాంతంలో నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ కార్యాలయం వద్ద జరిగిన ఓ ఆత్మాహుతి దాడిలో ఏడుగురు చనిపోయారు.

సాక్షి మహారాజ్‌కు ఇసి నోటీసులు

ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, జనవరి 10: యూపిలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంపీ సాక్షి మహారాజ్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలపై బుధవారంలోగా సమాధానం చెప్పాలంటూ నోటీసులో స్పష్టం చేశారు. లేనిపక్షంలో తామే చర్యలు తీసుకుంటామని ఇసి హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ నెల 6న జరిగిన ఓ ర్యాలీలో సాక్షి మహారాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 ప్రకారం ఎన్నికలు సమీపంలో ఉండగా మతం పేరుతో సమాజంలో వివిధ వర్గాలు, మతాల మధ్య వైషమ్యాలు పెంచేలా వ్యాఖ్యలు చేయకూడదు. అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంపీపై కాంగ్రెస్, ఎస్పీ, బిఎస్పీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. అలాగే జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌కు, మీరట్‌లోని సదర్‌బజార్‌లో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. సాక్షి మహారాజ్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందంటూ మంగళవారం ఇసి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సంఘం నోటీసులపై సాక్షి మహారాజ్ స్పందిస్తూ తాను ఏ వర్గం మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడలేదని అన్నారు. దేశంలో జనాభా పెరుగుదలపై గురించి మాత్రమే తాను వ్యాఖ్యానించానని ఆయన చెప్పుకొచ్చారు.