జాతీయ వార్తలు

మోదీది తుగ్లక్ పాలన మమతా బెనర్జీ ధ్వజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెందులి, జనవరి 10: పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీపై విరుచుకుపడుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలకు మరింత పదునుపెట్టారు. 14వ శతాబ్దంలో ఢిల్లీని పాలించిన మహ్మద్ బిన్ తుగ్లక్‌ను మోదీ మించిపోయారని మంగళవారం ఇక్కడ ఆరోపించారు. ‘నేను కేంద్రంలో అనేక ప్రభుత్వాలను చూశాను. అయితే ఇలాంటి తుగ్లక్ పాలన ఎప్పుడూ చూడలేదు. మోదీ నిర్ణయాలు అచ్చంగా తుగ్లక్ తీరులాగానే ఉన్నాయి’ అని తృణమూల్ అధినేత్రి ధ్వజమెత్తారు. తుగ్లక్ నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందని, ఇప్పుడు మోదీ విధానాలు ఆర్థిక సంక్షోభానికి కారణమవుతున్నాయని మమత నిప్పులు చెరిగారు. బిర్‌భూమ్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడిన మమత ‘మోదీ బాబు ప్లాస్టిక్ కరెన్సీకి సేల్స్‌మేన్‌లా వ్యవహరిస్తున్నారు. ప్రజలు ప్లాస్టిక్ కరెన్సీతో కడుపు నింపుకోవాలా?’ అంటూ ప్రశ్నించారు. ‘ప్రజల చేతిలో నగదు లేదు. జనం డబ్బును బ్యాంకులు నల్లధనం చేసేశాయి. బిజెపి సొమ్ములు మాత్రం వైట్ మనీ అయిపోయాయి’ అని ఆమె విరుచుకుపడ్డారు. కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకిస్తుంటే వారిపై అవినీతిపరులుగా ముద్రవేసి సిబిఐ లాంటి సంస్థలను ఎగదోస్తున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో మోదీని అమెరికా ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిందని, ఆయన ప్రధాని అయ్యాక కూడా తన పద్ధతులు మార్చుకోకుండా కుట్రలను పన్నుతున్నారని తృణమూల్ అధినేత్రి తీవ్ర ఆరోపణ చేశారు. కేంద్ర విధానలపై పోరాడేందుకు అందరూ ముందుకు రావాలని మమత పిలుపునిచ్చారు. సిపిఎంపైనా ఆమె నిప్పులు చెరిగారు. సిపిఎం హయాంలో పశ్చిమ బెంగాల్ సర్వనాశనం అయిందని మమత ధ్వజమెత్తారు. సిపిఎం, బిజెపిలను బెంగాల్ ప్రజలు తిప్పికొట్టారన్న ఆమె తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతోందని స్పష్టం చేశారు. పెద్దనోట్ల రద్దుతో నగదుకోసం క్యూలైన్లలో 120 మంది అమాయకులు మృతి చెందారని, దీనికి మోదీనే కారణమని విమర్శించారు. ప్రధాని మోదీ అహంకారి అంటూ మమత విరుచుకుపడ్డారు.

పార్లమెంటేరియన్ల
సదస్సుకు రండి
మేనకా గాంధీకి కోడెల ఆహ్వానం
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, జనవరి 10: ఏపిలో నిర్వహించనున్న మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు హాజరుకావల్సిందిగా కేంద్ర మహిళ, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆహ్వానించారు. మహిళా సాధికారిత లక్ష్యంగా సదస్సును ప్రతిష్టాత్మంగా నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా ఏపీలో మహిళా పార్లమెంటేరియన్ సదస్సును నిర్వహించడాన్ని మేనకాగాంధీ ప్రశంసించారని స్పీకర్ తెలిపారు. కోడెల విలేఖరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పదివేల మందికిపైగా విద్యార్థులు, ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు హాజరవుతారని తెలిపారు. సదస్సుకు హాజరుకావాలని తనకూ ఉందని అయితే ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రాలేనని మేనక చెప్పారు. తన సందేశాన్ని వీడియో రూపంలో పంపిస్తానని మంత్రి అన్నారని కోడెల వెల్లడించారు.

మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు హాజరుకావాలని జాతీయస్థాయిలో సీనియర్ జర్నలిస్టులను ఆహ్వానించినట్టు శివప్రసాదరావు తెలిపారు.