జాతీయ వార్తలు

30శాతం లైసెన్సులు బోగస్సే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో దాదాపు 30 శాతం లైసెన్సులన్నీ బూటకమేనంటూ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన ప్రకటన చేశారు. ఈ కీలక శాఖను నిర్వహిస్తున్న తనకు మూడోవంతు లైసెన్సులు బోగస్సేనని చెప్పడం ఇబ్బందికరంగా ఉందని అంగీకరించారు. బుధవారం ఇక్కడ జరిగిన సురక్షిత రహదారి శిఖరాగ్ర సదస్సులో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు గట్టి చర్యలు చేపడుతున్నామని, అందుకు వీలుగా ట్రాఫిక్ విధానాలను లోపరహితంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. వీటివల్ల ఎక్కడ ట్రాఫిక్ ఉల్లంఘన జరిగినా గుర్తించేందుకు అలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకునేందుకు ఆస్కారముంటుందని అన్నారు. రహదారి ప్రయాణాన్ని సురక్షితంగా తీర్చిదిద్దే చర్యల్లో లోపాలున్న వాస్తవాన్ని కూడా ఆయన అంగీకరించారు. ఈ లోపాలను గుర్తించి తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవడమన్నది తమ బాధ్యత అని అన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఆస్కారం లేని రీతిలో కఠిన చర్యలను ప్రభుత్వం తీసుకోబోతోందని స్పష్టం చేశారు. రహదారి నియమాలను ఉల్లంఘించిన వారిపై జరిమానా వేయడం వల్ల కొంత సానుకూల ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్న గడ్కరీ ‘ఇంత కఠినంగా వ్యవహరించకపోతే రహదారి భద్రతను పర్యవేక్షించడమన్నది, నియమాలు అమలుచేయడమన్నది సాధ్యం కాదు’ అని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో రహదారి వ్యవస్థలను తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. ఈ దిశగానే తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఈ వ్యవస్థను కంప్యూటరీకరించడం వల్ల అవినీతికి ఏ రకంగానూ ఆస్కారం ఉండదన్నారు. ఎవరైతే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తారో వారికి ఆ సమాచారం వెళ్లిపోతుందని, జరిమానా కూడా ఖరారవుతుందని పేర్కొన్న ఆయన అధికారుల ప్రమేయం లేకుండానే కంప్యూటరీకరణ వల్ల ఈ ప్రక్రియ అంతా జరిగిపోతుందని అన్నారు. ప్రస్తుతమున్న మోటారు వాహనాల చట్టానికి కాలం చెల్లిందని అందుకే దీన్ని మరింత కఠినంగా తీర్చిదిద్దేందుకు ఓ సవరణ తేబోతున్నామన్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల 27న ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను కేబినెట్ పరిశీలనకు, అనంతరం పార్లమెంటుకు సమర్పించే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సవరణ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ బాధితులకు పరిహారం, లైసెన్సు నిబంధనలను కఠినతరం చేయడం, చట్టాలను ఉల్లంఘించే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.

చిత్రం... సురక్షిత రహదారి విధానానికి
మద్దతు తెలుపుతూ సంతకం
చేస్తున్న నితిన్ గడ్కరీ