జాతీయ వార్తలు

అద్నాన్ షమీకి భారత పౌరసత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: పాకిస్తాన్‌లో జన్మించి, గత కొన్ని సంవత్సరాలుగా భారత్‌లో నివసిస్తున్న గాయకుడు అద్నాన్ షమీ శుక్రవారం భారత పౌరసత్వం పొందారు. ఇక్కడి నార్త్ బ్లాక్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు చేతుల మీదుగా ఆయన పౌరసత్వ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సమయంలో 46 ఏళ్ల షమీతో పాటు ఆయన భార్య రోయా కూడా ఉన్నారు. ఆ తరువాత ఆయన తన బహుళ ప్రాచుర్యం పొందిన పాట ‘తేరీ ఊంచీ షాన్ హై వౌలా.. ముజ్‌కో భీ తో లిఫ్ట్ కరా దే’ను పాడి అందరినీ అలరించారు. భారత పౌరసత్వం తనకు ‘కొత్త జన్మ’ అని, ‘అందమైన కానుక’ అని షమీ అభివర్ణించారు. భారత్‌లో అసహన వాతావరణం లేదని, తానెప్పుడూ అలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదని, ఎదుర్కొని ఉంటే తాను భారత పౌరసత్వాన్ని తీసుకొని ఉండేవాడిని కాదని షమీ ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనకు భారత పౌరసత్వాన్ని ఇవ్వడానికి ఆమోదం తెలిపినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, ఈ విషయంలో తనకు మద్దతిచ్చిన హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు షమీ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలా ఉండగా, షమీకి భారత పౌరసత్వం ఇవ్వడం పట్ల బిజెపి మిత్ర పక్షమైన శివసేన ఆశ్యర్యం వ్యక్తం చేసింది. షమీ పట్ల బిజెపి పాటించిన ద్వంద్వ ప్రమాణాలను ఇది వెల్లడిస్తోందని శివసేన అధికార ప్రతినిధి మనీషా కయాండే అన్నారు. బిజెపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు షమీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిందని, ఇప్పుడు భారత పౌరసత్వం ఇచ్చిందని కయాండే వ్యాఖ్యానించారు.

చిత్రం.. పాకిస్తాన్ గాయకుడు అద్నాన్ షమీకి భారత పౌరసత్వ ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తున్న హోంశాఖ సహాయ మంత్రి కిరెక్ రిజిజు... షమీకి పౌరసత్వం ఇవ్వడంపై ఢిల్లీలో నిరసన తెలుపుతున్న హిందూసేన కార్యకర్తలు