జాతీయ వార్తలు

దేశవ్యాప్తంగా హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలున్నాయని నిఘావర్గాలు హెచ్చరించటంతో పౌర విమాన యాన అధికారులు అన్ని విమానాశ్రయాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. పౌర విమానయాన భద్రతా బ్యూరో డిసెంబర్ 28నే ఆయా విమానాశ్రయాలకు నోట్‌ను విడుదల చేశారు. యూనిఫామ్‌లో ఉన్న సిబ్బందికి విమానాశ్రయంలోకి వెళ్లేందుకు ఎంట్రీ పాస్‌లు ఉంటాయి. ఇలాంటి వాళ్ల విషయంలో సిఐఎస్‌ఎఫ్ జవాన్లు చూసీ చూడనట్లు ఉదారంగా వ్యవహరించటం సరికాదని, యూనిఫామ్ ముసుగులో కూడా ఉగ్రవాదులు చొరబడే అవకాశాలున్నందున ఎంట్రీ పాస్‌లు ఉన్నప్పటికీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గణతంత్ర దినోత్సవాలను నిర్వహించే బాధ్యత రక్షణ మంత్రిత్వ శాఖపై ఉంటుంది. అందువల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పారామిలటరీ బలగాలను సున్నితమైన ప్రాంతాల్లో మోహరిస్తున్నారు.