జాతీయ వార్తలు

రాష్ట్రానికి కొత్త రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: తెలంగాణలో ముఖ్యమైన ప్రాంతాలకు ప్రాంతీయ విమానయాన సౌకర్యం కల్పించేందుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణలోని ముఖ్యమైన ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు విమానయాన సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి జరుగుతుంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, రాష్ట్ర ఐటి మంత్రి కె తారకరామారావు సమక్షంలో బుధవారం కేంద్ర పౌరవిమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం అధికారులు ఎంఓయుపై సంతకాలు చేశారు. ఇరుపక్షాలు తెలంగాణలో ప్రాంతీయ విమానయాన సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలను ఎంపిక చేస్తారు. సాధ్యాసాధ్యాల పరిశీలన అనంతరం ప్రాంతీయ విమానయాన సౌకర్యం ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకుంటారు.
ఇదిలావుంటే నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు బేగంపేట విమానాశ్రయంలోని నాలుగు హ్యాంగర్లను లీజుకివ్వాలన్న తెలంగాణ ప్రతిపాదనను సానుభూతితో పరిశీలిస్తానని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోకగజపతిరాజు హామీ ఇచ్చారు. బేగంపేట విమానాశ్రయంలోని నాలుగు హ్యాంగర్లు ప్రస్తుతం నిరుపయోగంగా పడిఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసేందుకు ఇక్కడ నైపుణ్య శిక్షణా అకాడమీ ఏర్పాటు చేయవచ్చని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రతిపాదనను సానుభూతితో పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని అశోకగజపతిరాజు హామీ ఇచ్చారు. ప్రాంతీయ విమానయాన విధానాన్ని ఆమోదించినందుకు ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. బేగంపేట విమానాశ్రయంలోని హ్యాంగర్లలో నైపుణ్య కేంద్రాల ఏర్పాటు మంచి ప్రతిపాదనని కితాబిచ్చారు. ప్రాంతీయ విమానయాన పథకం కింద దేశంలోని యాభై ప్రాంతీయ కేంద్రాల్లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. నైపుణ్య సేవలు అందించటం ద్వారా ఇండియన్ ఏయిర్ లైన్స్ 750 మిలియన్ డాలర్లు సంపాదించిందన్నారు. దేశం నుంచి కూడా ఇలాంటి ఆదాయం వస్తే ఎంతో మంచిదని అశోకగజపతిరాజు అన్నారు. తెలంగాణ ప్రతిపాదనను సానుభూతితో పరిశీలిస్తామని హామీ ఇచ్చిన అశోకగజపతిరాజుకు మంత్రి కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగుడెంలో విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదనను ఆమోదించినందుకు కూడా ఆయన కృతజతలు చెప్పారు. ఆర్థికంగా సాధ్యమయ్యే ప్రాంతాల్లో ప్రాంతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తారని ఈ సందర్భంగా మంత్రి మీడియాకు చెప్పారు. తెలంగాణలోని ముఖ్యమైన చిన్న పట్టణాల నుంచి విమానయాన సౌకర్యం కల్పించాలన్నది తమ లక్ష్యమని వివరించారు.
సిమెంట్ ప్లాంట్ పునరుద్ధరణ
ఆదిలాబాద్‌లోని సిసిఐ సిమెంట్ ప్లాంటు పునరుద్ధరణపై అధికారులతో చర్చించిన అనంతరం ఒక నిర్ణయానికి వస్తామని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి అనంత్ గీతే హామీ ఇచ్చారు. తెలంగాణ ఐటి, భారీ పరిశ్రమల మంత్రి కెటిఆర్, రాష్ట్ర అటవీ, పర్యావరణం, వెనుకబడిన కులాల సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, ఎంపీ బూరనరసయ్య గౌడ్ బుధవారం కేంద్ర మంత్రిని కలిసి ఆదిలాబాద్‌లోని సిసిఐ సిమెంట్ ప్లాంట్ పునరుద్ధరణపై చర్చించారు. 1998లో ప్లాంటు మూతపడినప్పటి నుంచి దాదాపు రెండు వేలమంది కార్మికులు ఉపాధి కోల్పోయారని మంత్రితో చెప్పారు. సిసిఐ సిమెంట్ ప్లాంట్ పునరుద్ధరించేందుకు కేంద్రం ముందుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని కెటిఆర్ వివరించారు. కొత్త పరిశ్రమ స్థాపనకు ఇచ్చే అన్ని రాయితీలు, సౌకర్యాలు సిసిఐ ప్లాంట్ పునరుద్ధరణకు కల్పిస్తామని కేంద్ర మంత్రికి వివరించారు. మంత్రి జోగురామన్న గతంలో గీతేను కలిసి సిసిఐ ప్లాంట్ పునరుద్ధరణ గురించి అడిగితే, రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు సహాయం చేస్తుందని అడిగేవారని, అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందనేది కేంద్ర మంత్రికి వివరించామని కెటిఆర్ అన్నారు. సిసిఐ ప్లాంటు వద్ద సొంత సిమెంట్ గనులున్నాయి. దాదాపు ఏడు వందల ఎకరాల భూమి ఉంది. కాబట్టి దీని పునరుద్ధరణ అత్యంత సులభమని కెటిఆర్ వివరించారు. రామగుండంలో ఎరువుల కార్మాగారం పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టినట్టే, సిసిఐ ప్లాంటు పునరుద్ధరణకూ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చామని కెటిఆర్ పేర్కొన్నారు. కేంద్రం సిసిఐ ప్లాంట్ పునరుద్ధరణ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. ఆదిలాబాద్‌లోని ఏకైక పరిశ్రమ సిసిఐ ప్లాంట్ అని జోగు రామన్న పేర్కొన్నారు. జోగు రామన్న ఆ తరువాత కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తవర్‌చంద్ గెహ్లాట్‌ను కలిసి బీసీ సమస్యలపై చర్చించారు.
chitram...
కేంద్ర, రాష్టమ్రంత్రులు అశోక్‌గజపతి రాజు, కెటిఆర్‌ల సమక్షంలో ఒప్పంద ప్రతాలు మార్చుకుంటున్న అధికారులు