జాతీయ వార్తలు

జెపి పింఛనుకు లాలూ ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జనవరి 11: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ జెపి సేనాని సమ్మాన్ పింఛనుకు ఎంపికయ్యారు. దీంతో అతను ఈ పింఛను పథకం కింద ప్రతి నెలా రూ. పది వేల మొత్తం పొందనున్నారని బిహార్ రాష్ట్ర హోంశాఖ అధికారులు బుధవారం ఇక్కడ తెలిపారు. జెపిగా ప్రాచుర్యం పొందిన జయప్రకాశ్ నారాయణ్ 1974లో ‘సంపూర్ణ క్రాంతి’ (సంపూర్ణ విప్లవం) ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు విద్యార్థిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ అందులో పాల్గొని మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటి యాక్ట్ కింద జైలుకెళ్లారు. ఈ పథకానికి 2015లో చేసిన సవరణలవల్ల లాలూ ప్రసాద్ ఈ పింఛనుకు అర్హులయ్యారు. నెల నుంచి ఆరు నెలల వరకు జైలుశిక్ష అనుభవించిన వారికి నెలకు రూ. 5వేలు, ఆరు నెలలకన్నా ఎక్కువ కాలం జైలుశిక్ష అనుభవించిన వారికి నెలకు రూ. పది వేల చొప్పున పింఛను చెల్లిస్తారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం రెండో విభాగంలో ఉన్న లాలూ ప్రసాద్ రూ.పది వేల పింఛనుకు ఎంపికయ్యారు.
లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ గౌరవార్థం అప్పట్లో అతని అనుచరుడయిన నితీశ్ కుమార్ మొదటిసారి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు 2009లో పింఛను పథకాన్ని ప్రారంభించారు. నితీశ్ కుమార్ కూడా ఈ పింఛనుకు అర్హులని, అయితే ఆయన తీసుకోవడం లేదని అధికారులు తెలిపారు. మొత్తం 3,100 మంది ఈ పథకం కింద పింఛను పొందుతున్నారు. బిజెపి సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోడి కూడా ఈ పింఛను పొందుతున్నారు.