జాతీయ వార్తలు

కెన్యాకు భారత్ 10కోట్ల డాలర్ల రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: వ్యవసాయ యాంత్రికీకరణకోసం భారత్ కెన్యాకు 10 కోట్ల (100 మిలియన్) డాలర్ల రుణం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. బుధవారం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యట్టా మధ్య చర్చల అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు. ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చర్చల సందర్భంగా ఇరువురు నేతలు నిర్ణయించడంతో పాటుగా ద్వైపాక్షిక వాణిజ్యం విస్తరణను ప్రాధాన్యతా అంశంగా సైతం గుర్తించారు. సముద్ర వాణిజ్యానికి సంబంధించిన సవాళ్లు రెండు దేశాలకు ఆందోళన కలిగిస్తున్న విషయమని ప్రధాని అన్నారు. ఈ రంగంలో అవకాశాలను ఉపయోగించుకోవడానికి రెండు దేశాలు ప్రయత్నిస్తాయని చెప్పారు. భద్రతా సహకారాన్ని, సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోవాలని తాము నిర్ణయించామని, ఈ దిశగా వీలయినంత త్వరగా సమావేశం కావాలని జాయింట్ వర్కింగ్ గ్రూపును ఆదేశించడం జరిగిందని అన్నారు. సైబర్ సెక్యూరిటీ, ఉగ్రవాద నిరధం, డ్రగ్స్, మాదకద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా, మనీ లాండరింగ్ లాంటి విషయాలను అది చర్చిస్తుందని కెన్యట్టాతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని చెప్పారు. కెన్యాలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయని, వ్యవసాయ యాంత్రికీకరణ కోసం ఈ రోజు సంతకాలు చేసిన 100 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం ఈ రంగంలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించడానికి దోహదపడుతుందని చెప్పారు. కాగా, ఐటి తదితర రంగాల్లో స్కాలర్‌షిప్‌లు అందించడంతో పాటుగా వివిధ రంగాల్లో సహకారాన్ని అందిస్తున్నందుకు కెన్యట్టా భారత్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. కెన్యాలో పెట్టుబడులు పెట్టాలని భారతీయ కంపెనీలను ఆహ్వానించిన ఆయన భారతీయ మార్కెట్లలో కెన్యా ఉత్పత్తులకు మరింతగా అవకాశాలు కల్పించాలని కోరారు.