జాతీయ వార్తలు

పార్టీ వివాదానికి దూరంగా ఉండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 11: సమాజ్‌వాది పార్టీ చీలిపోవడానికి ఎట్టి పరిస్థితుల్లోను అవకాశం ఇవ్వనని ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష పదవి తనకే ఇవ్వాలని కుమారుడు, యుపి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చేసిన డిమాండ్‌ను ప్రస్తావిస్తూ ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. తన దగ్గరున్నవన్నీ ఇచ్చేశానని ఆయన అంటూ, వివాదానికి దూరంగా ఉండాలని కుమారుడికి సలహా ఇచ్చారు. బుధవారం న్యూఢిల్లీకి వెళ్లడానికి ముందు ఇక్కడి సమాజ్‌వాది పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన ములాయం మరోసారి తన సమీప బంధువయిన రామ్‌గోపాల్ యాదవ్‌పై ధ్వజమెత్తుతూ, పార్టీని చీల్చడానికి కుట్ర పన్నుతున్నాడని ఆరోపించడమే కాకుండా సోదరుడు శివపాల్ యాదవ్‌కు పూర్తి మద్దతు అపకటించారు. ‘మరో పార్టీ అధ్యక్షుడ్ని మూడుసార్లు కలిసిందెవరో నాకు తెలుసు. ఆయన తన కుమారుడు, కోడలిని కాపాడుకోవాలని అనుకుంటున్నారు. ఆయన నా దగ్గరికి వచ్చి ఉంటే నేనే అతడ్ని కాపాడి ఉండేవాడిని’ అని ములాయం అన్నారు. పార్టీలో తలెత్తిన విభేదాలను వివాదం చేయవద్దని ప్రత్యర్థి వర్గాన్ని కోరుతూ పార్టీ సంఘటితంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని, కొత్త పార్టీ పెట్టబోవడం లేదని, పార్టీ గుర్తును మార్చాలని కూడా అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘అఖిల భారతీయ సమాజ్‌వాది పార్టీని ఎవరు ఏర్పాటు చేయబోతున్నారో, మోటారు సైకిల్ గుర్తును కోరుకుంటున్నారో నాకు తెలుసు’ అని ములాయం అన్నారు.
పార్టీ అధ్యక్ష పదవి తనకే ఇవ్వాలన్న కుమారుడు అఖిలేశ్ డిమాండ్‌ను ప్రస్తావిస్తూ ములాయం ఉద్వేగానికి గురయ్యారు. ‘నా దగ్గరున్నదంతా ఇచ్చేశాను. ఇంకా నా దగ్గర ఏముంది? మీరు (కార్యకర్తలు) మాత్రమే ఉన్నారు’ అని ఆయన అన్నారు. అఖిలేశ్ యాదవ్ రెండేళ్ల పిల్లాడుగా ఉన్నప్పుడు తాను సమాజ్‌వాది పార్టీని స్థాపించానని ములాయం చెప్పారు. ములాయం విలేఖరులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన పక్కనే సోదరుడు శివపాల్ ఉన్నారు. ‘అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబోయే ముఖ్యమంత్రి కూడా ఆయనే’ అని చెప్పిన ములాయం అనవసరంగా వివాదాల్లోకి దిగవద్దని కుమారుడికి హితవు చెప్పారు. ఏది ఏమయినా పార్టీ కలిసికట్టుగా ఉండాలనే తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఆయన సోదరుడు శివపాల్‌ను ప్రశంసలతో ముంచెత్తుతూ పార్టీకోసం ఎంతో కష్టపడ్డాడన్నారు.
శివపాల్‌ను యుపి సమాజ్‌వాది పార్టీ అధ్యక్ష పదవినుంచి తప్పించాలని, అమర్‌సింగ్‌ను పార్టీనుంచి బహిష్కరించాలని అఖిలేశ్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ములాయం మాత్రం ఆ రెండు డిమాండ్లకు అంగీకరించకపోవడంతో పార్టీ నెలకొన్న ప్రతిష్టంభన అలాగే కొనసాగుతోంది. మీ ఆందోళన సమర్థనీయమేనని, ఎందుకంటే ఎన్నో కష్టనష్టాల తర్వాత సమాజ్‌వాది పార్టీని ఏర్పాటు చేశామని పార్టీ కార్యకర్తలనుద్దేశించి ములాయం అంటూ, ఎట్టి పరిస్థితుల్లోను పార్టీని చీలిపోనివ్వబోమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో సంఘటితంగానే పోటీ చేస్తామని తాము ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. కాగా, సైకిల్ గుర్తు తమకే దక్కుతుందన్న నమ్మకాన్ని ములాయం వ్యక్తం చేశారు.
chitram...
లక్నోలో బుధవారం ఎస్‌పి కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతున్న ములాయం సింగ్. చిత్రంలో ఆయన సోదరుడు శివపాల్ యాదవ్