జాతీయ వార్తలు

ఆదుకున్న మన్మోహన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా ప్రతిఘటించిన మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ పార్లమెంట్ స్థారుూ సంఘం సమావేశంలో ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఎవరిది, ఆర్‌బిఐ స్వయం ప్రతిపత్తి, సాధారణ పరిస్థితుల పునరుద్ధరణ, నగదు పరిమితిని ఎప్పుడు ఎత్తివేస్తారంటూ సభ్యులు వరుసగా ప్రశ్నలను సంధించడంతో ఉర్జిత్ పటేల్ ఇరకాటంలో పడే పరిస్థితి ఏర్పడిందని అధికార వర్గాలు తెలిపాయి. సరైన సమాధానం చెప్పలేక ఉర్జిత్ తికమక పడుతున్న తరుణంలో మన్మోహన్ జోక్యం చేసుకుని ఆయన్ని ఆదుకున్నారని, ఆర్‌బిఐ గవర్నర్ స్థాయిని, ఈ వ్యవస్థను గౌరవించాల్సిన అవసరం ఎంతో ఉందని స్పష్టం చేశారని ఈ వర్గాలు వెల్లడించాయి. అన్ని రకాల ప్రశ్నలను వేసి ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పడమే కాకుండా ‘నగదు తీసుకునే పరిమితులు ఎప్పుడు ఎత్తివేస్తారంటూ..’ ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఉర్జిత్‌కు మన్మోహన్ స్పష్టం చేసినట్టు తెలిసింది.