జాతీయ వార్తలు

సల్మాన్ నిర్దోషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోధ్‌పూర్, జనవరి 18: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టులో పెద్ద ఊరట లభించింది. 18 ఏళ్లనాటి కృష్ణ జింకల వేట ఘటనలో సల్మాన్‌పై మోపిన ఆయుధాల చట్టం కేసులో రాజస్థాన్ కోర్టు ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అతడిపై చేసిన అభియోగాలను ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని బుధవారం న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో 102 పేజీల తీర్పును చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ దల్పత్‌సింగ్ చదివి వినిపించారు. సల్మాన్ వద్ద గడువుముగిసిన లైసెన్స్ ఆయుధాలు ఉన్నాయన్న ప్రాసిక్యూషన్ దానికి ఆధారాలు చూపలేకపోయిందని కోర్టు పేర్కొంది. 51 ఏళ్ల సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అల్విరా బుధవారం కోర్టుకు హాజరయ్యారు. 18 ఏళ్లనాటి కేసు నుంచి నిర్దోషిగా న్యాయమూర్తి తీర్పును ఇవ్వగానే ఖాన్ భావోద్వేగానికి గురయ్యారు. అభిమానులకు ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. ‘నాకు మద్దతు ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు’అంటూ ఖాన్ ట్వీట్ చేశారు. 1998 అక్టోబర్ 1,2 తేదీల్లో రాజస్థాన్‌లోని కంకణి గ్రామంలో సల్మాన్ రెండు కృష్ణ జింకలను వేటాడినట్టు అభియోగం. లైసెన్స్ ముగిసిపోయిన ఆయుధంతో కాల్పులు జరిపినట్టు కేసు నమోదైంది. సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించిన న్యాయమూర్తి జిల్లా అధికార యంత్రాంగం తీరును తప్పుపట్టింది.