జాతీయ వార్తలు

అనాధ పిల్లలకూ ఆధార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: అనాధ పిల్లలకు చదువుకునే, వైద్య సేవల్ని పొందే హక్కును కల్పించడంలో భాగంగా వారికి ఆధార్ కార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అనాధ పిల్లల పునరావాసం, హక్కుల కల్పనకు ఉద్దేశించిన ఈ పథకాన్ని త్వరలోనే మహిళా శిశు వికాస మంత్రిత్వ శాఖ ప్రారంభించనుంది. ఆరోగ్య బీమా, బ్యాంకు ఖాతాలు, ఆర్థిక పరమైన వెసులుబాటును కూడా వీరికి కల్పించాలన్నదే తమ ఉద్దేశమని చెబుతున్నారు. వీధుల్లోనే బతుకు గడిపే పిల్లల్లో 80శాతం మందికి ఎలాంటి గుర్తింపూ లేదని, వీరు తమ హక్కుల్ని, ప్రభుత్వ సేవల్ని పొందడానికి ఇదే పెద్ద అవరోధంగా మారుతోందని సేవ్ ది చిల్డ్రన్ అనే ఎన్‌జిఓ స్పష్టం చేసింది. గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల వీరికి స్కూళ్లలో ప్రవేశం లభించడం లేదని, ఆరోగ్య సేవలూ అందకుండా పోతున్నాయని తెలిపింది. వీరందరికీ ఆధార్ కార్డును అందిస్తే..ఇవన్నీ వారికి అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. పిల్లల హక్కుల కోసం పనిచేసే సంస్థలకు కూడా వీధి పిల్లల్ని ఎలా ఆదుకోవాలో తెలియని పరిస్థితి తలెత్తుతోందని, దీని దృష్ట్యా..మొత్తం నాలుగు దశల్లో వీరిని ఆదుకునే మార్గాన్ని సుగమం చేశామని పిల్లల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ చైర్మన్ స్తుతి కాకెర్ తెలిపారు. పది సంవత్సరాలు పైబడిన వీధి బాలలకు బ్యాంకు ఖాతా తెరవడం, దాన్ని నిర్వహించడంలో సహకరిస్తామని తెలిపారు. ఈ వీధి పిల్లలకు కుటుంబం ఉన్నట్టు గుర్తిస్తే అలాంటి కుటుంబాన్ని స్పాన్సర్‌షిప్ కార్యక్రమ పరిధిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. దీని వల్ల ఆ పిల్లల్ని వైద్య, ఆరోగ్య, పౌష్టికాహార పరంగా ఆదుకోవడం సాధ్యమవుతుందన్నారు.