జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్‌పై బిజెపి ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఉత్తరాఖండ్‌లో అస్సాం తీర్పు పునరావృతమవుతుందా? అస్సాంలో ఎన్నికలకు ముందు బిజెపి అనుసరించిన వ్యూహానే్న ఉత్తరాఖండ్‌లోనూ ఆ పార్టీ అమలు చేస్తోంది. అస్సాంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించటానికి కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ ఆయువుపట్టుగా నిలిచిన సీనియర్ నేతలు హిమంత బిశ్వ శర్మతో సహా పలువురు కమలం వైపు దూకడం ఆ పార్టీకి బాగా కలిసివచ్చింది.
ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోనూ అదే ఎత్తుగడతో బిజెపి ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ పిసిసి చీఫ్ యశ్‌పాల్ ఆర్యతో పాటు, కేదార్ రావత్, హరక్ సింగ్ రావత్, సత్పాల్ మహరాజ్ బిజెపిలో చేరారు. వీళ్లంతా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పట్టున్న నేతలు కావటం గమనార్హం. ఈ ప్రాంతాల్లో ఒక్క శాతం ఓటు కూడా ఫలితాన్ని మార్చేస్తుంది. 2012 ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి బిసి ఖండూరీ క్లీన్ ఇమేజి ఉన్నప్పటికీ, కాంగ్రెస్ 32 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బిజెపికి 31సీట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య ఒకే ఒక్కసీటు తేడా ఉండటమే కాకుండా ఓట్ల తేడా కూడా కేవలం 0.66 శాతమే ఉండటం విశేషం. ఈ కొద్దిపాటి తేడాతోనే కాంగ్రెస్ ఉత్తరాఖండ్‌లో అధికారం సాధించింది. అస్సాంలో హిమంత్ బిశ్వ శర్మ బిజెపి విజయంలో కీలక భూమిక నిర్వహించినట్లే, ఉత్తరాఖండ్‌లో యశ్‌పాల్ ఆర్య అండ బిజెపి విజయానికి దన్నుగా నిలిచే అవకాశాలు కన్పిస్తున్నాయి. తాను ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రకటించకపోయినప్పటికీ విజయం తమదేనని పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి.

బిజెపిలోకి
ఎన్డీ తివారి
డెహ్రాడూన్, జనవరి 18: కాంగ్రెస్ కురువృద్ధ నేత ఎన్‌డి తిరావీ తన కుమారుడు రోహిత్, ఆయన భార్య ఉజ్వలతో కలిసి బిజెపిలో చేరారు. ఉత్తర ప్రదేశ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తివారీ, ఉత్తరాఖండ్‌కు మూడో ముఖ్యమంత్రిగా 2002 నుంచి 2007 వరకు పనిచేశారు. కేంద్రంలో పలు మంత్రిత్వ శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2007 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా కూడా ఉన్నారు. సెక్స్ టేప్ వివాదంలో ఆరోపణలు ఎదుర్కోవటంతో గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి 11మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు బిజెపిలో చేరిన నేపథ్యంలో ఎన్డీ తివారీ చేరిక కూడా ఆ పార్టీకి బలమైన అస్త్రంగా పనిచేస్తుందని భావిస్తున్నారు.