జాతీయ వార్తలు

పౌష్టికాహారంపై యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: దేశంలో లభించే అన్ని రకాల ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాల పోషకాహార విలువలను తెలియజేసే యాప్ సిద్ధమవుతోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా వెల్లడించారు. హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) రూపొందించిన ఇండియన్ ఫుడ్ కాంపోజీషన్ టేబుల్స్ (్భరత ఆహార పట్టికల కూర్పు) పుస్తకాన్ని నడ్డా బుధవారం ఐఎంఆర్ సమావేశంలో ఆవిష్కరించారు. జాతీయ పోషకాహార సంస్థ దీనికి రూపకల్పన చేసింది. గతంలోనే ఇలాంటి పుస్తకాన్ని తయారు చేసినా అది అసమగ్రంగా ఉండేదని, ఇప్పుడు రూపొందించిన పుస్తకంతో ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పుస్తకం ద్వారా ఆహార పదార్థాలు, ఆహార ధాన్యాలలోని పౌష్టకాహార విలువలను తెలుసుకోవటం ఎంతో సలభమని చెబుతూ ఇందుకు సంబంధించిన యాప్‌ను కూడా తయారు చేయాలన్న సూచనకు ఎన్‌ఐఎన్ త్వరలోనే కార్యరూపం ఇస్తోందన్నారు. ప్రపంచంలోని కొన్ని దేశాలకు మాత్రమే ఇలాంటి ఫుడ్ కాంపోజీషన్ టేబుల్స్ ఉన్నాయని, ఈ రోజుతో భారతదేశం కూడా ఎంపిక చేసిన ఈ దేశాల సరసన చేరిందని మంత్రి ప్రకటించారు. దేశ ప్రజలకు పౌష్టికాహారాన్ని అందజేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేసే పథకాలకు ఈ పుస్తకం ఎంతో తోడ్పడుతుందన్నారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు ఏ మేరకు పౌష్టికాహారాన్ని అందజేయాలనేది ఈ పుస్తకం వలన ఎంతో సులభం అవుతుందని ఆయన చెప్పారు. ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ సౌమ్యా స్వామినాథన్ మాట్లాడుతూ పౌష్టికాహార పట్టికలు, ఆహార విలువలతో కూడిన ఆహార పదార్థాలను తయారు చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రైవేట్ రంగానికి కూడా తోడ్పడుతుందని చెప్పారు.

కోర్టు డిక్రీ అమలుచేయాల్సిందే

సట్లెజ్, యమున వివాదంపై సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ, జనవరి 18: సట్లెజ్, యమున లింక్ కాలువ వివాదానికి సంబంధించి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని సుప్రీం కోర్టు బుధవారం విస్పష్టంగా తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి అమలును విస్మరించడానికి వీల్లేదంటూ పంజాబ్, హర్యానాను హెచ్చరించింది. సుప్రీం కోర్టు జారీ చేసిన డిక్రీలను త్రికరణ శుద్ధిగా సంబంధిత రాష్ట్రాలు అమలుచేసి తీరాల్సిందేనని ఇందులో రెండో ఆలోచనకు తావేలేదని న్యాయమూర్తులు పిసి ఘోష్, అమితావారాయ్‌లతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను పాటించాల్సిందేనంటూ హర్యానా దాఖలు చేసిన అభ్యర్థనకు సమాధానం చెప్పాలని ఇటు కేంద్రం, అటు పంజాబ్ రాష్ట్రాన్ని కోర్టు ఆదేశించింది. ఈ కాలువకు సంబంధించిన అంశాలపై కోర్టు రిసీవర్లుగా నియమితులైన అధికారులు యథాతధస్థితి కొనసాగుతుందన్న విషయాన్ని తమకు స్పష్టం చేశారని బెంచ్ తెలిపింది.

మాలిలో ఆత్మాహుతి దాడి

బమాకో, జనవరి 18: ఆఫ్రికా దేశమైన మాలిలో బుధవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది మరణించినట్లు ఐరాస, స్థానిక అధికార వర్గాలు తెలిపాయి. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి కారులో వచ్చి తనను తాను పేల్చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దేశ ఉత్తర ప్రాంతంలో మాజీ తిరుగుబాటుదారులు, ఇస్లామిక్ పోరాట యోధులకు గట్టి స్థావరమైన గావో ప్రాంతంలో ఈ దాడి జరిగింది. గావో విమానాశ్రయానికి సమీపంలో సైనికుల స్థావరాలపై జరిగిన ఈ దాడిలో మరో 60 మంది గాయపడినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

2015లో తిరుగుబాటుదారుల ముఠాలు, ప్రభుత్వానికి మధ్య కుదిరిన శాంతి ఒప్పందంలో భాగంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఒప్పందంలో భాగంగా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.40 గంటల సమయంలో మాజీ తిరుగుబాటుదారుల, ప్రభుత్వ అనుకూల మిలీషియా సభ్యులు ఉమ్మడి పెట్రోలింగ్‌కు బయలుదేరి వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ దాడి పట్ల మాలి అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించారు.

ఎన్నికల రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సోదాలు

భారీగా నగదు, మద్యం పట్టివేత

న్యూఢిల్లీ, జనవరి 18: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిఘా, ఖర్చు పర్యవేక్షణ బృందాలు భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పటి వరకూ రూ.64 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా అందులో రూ.56కోట్లు ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే లభించాయి. పంజాబ్‌లో రూ.1.78 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల (హిరాయిన్, పాపీ హస్క్)ను పట్టుకున్నారు. గోవాలో కూడా 16.72 లక్షల విలువైన డ్రగ్స్ దొరికాయి. ఇక మణిపూర్‌లో రూ.7లక్షలను స్వాధీన పరచుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో రూ.6.06కోట్ల విలువైన 10, 646 లీటర్ల మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పంజాబ్‌లో రూ.17.54లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోవా, ఉత్తరాఖండ్‌లలో ఇప్పటి వరకు అక్రమంగా తరలిస్తున్న మద్యం కానీ, నగదు కానీ లభ్యం కాలేదని అధికారులు వెల్లడించారు. యూపీలో సాధీనం చేసుకున్న రూ.56కోట్లలో 31.65 లక్షల రూపాయలు రద్దయిన పాతనోట్లు లభించాయని అధికారులు వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పటివరకు మాదకద్రవ్యాలు ఎర చూపుతున్నట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని వారు పేర్కొన్నారు.

యూపి ప్రచారంలో
ప్రాసల హోరు

లక్నో, జనవరి 18: ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల ప్రభావం తాజాగా జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంపై బాగానే పడుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ప్రజలను ఆకట్టుకోవటానికి పార్టీలు సృజనాత్మకతకు పదునుపెట్టాయి. ఆకర్షణీయమైన నినాదాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రాసల ప్రయోగాలతో పంచ్‌లు విసురుతున్నాయి.
‘అఖిలేశ్‌కా జల్‌వా కాయమ్ హై, ఉస్కా బాప్ ములాయం హై’ ‘బేటీయోంకో ముస్కురానే దో, బెహన్‌జీకో ఆనేదో’ ‘అబ్‌కీ బార్ 300కే పార్’ లాంటి నినాదాలు ఎన్నికల ప్రచారంలో బాగానే పేలుతున్నాయి. ప్రత్యర్థులపై వ్యంగ్యోక్తులు, తాము అధికారంలోకి వస్తే ఇచ్చే హామీలతో కొత్త కొత్త నినాదాల రూపకల్పనలో పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. ‘హర్ హర్ మోదీ, ఘర్ ఘర్ మోదీ’ అంటూ బిజెపి చేస్తున్న ప్రచారానికి చెక్ పెడుతూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘అర్‌హర్ మోదీ’ అంటూ నినదిస్తున్నారు. ఆయన ముందునుంచీ చేస్తున్న ‘సూట్‌బూట్‌కీ సర్కార్’ నినాదం యూపీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రముఖంగా వాడుతోంది. నోట్ల రద్దుపై ‘గరీబోన్ సే ఖీచో.. అమీరోన్‌కో సీచో’ అంటూ విరుచుకుపడుతోంది. ‘‘ఖర్జా మాఫ్, బిజ్లీ బిల్ హాఫ్, ఎంఎస్‌పి కా కరో హిసాబ్’’ అంటూ వాగ్దానాలనూ నినాదాల్లో పొందుపరుస్తోంది. ఇక బిజెపి ఇప్పటికీ మోదీనే ఇమేజినే ప్రచారాస్త్రంగా వాడుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు ‘అబ్ కీ బార్ మోదీ సర్కార్’ అన్న నినాదానే్న కాస్త మార్చి ‘అబ్ కీ బార్ 300కే పార్’ అంటూ కొత్త పల్లవి మొదలుపెట్టంది. ‘జన్ జన్ కే సంకల్ప్ పరివర్తన్ ఏక్ వికల్ప్’ అంటూ యూపిలో పరివర్తన రావాలంటూ నినాదాలు రూపొందించింది.