అంతర్జాతీయం

చెప్పినవన్నీ చేసి చూపిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 21: తన పని ప్రారంభమైనందున ఇకపై ఎలాంటి నాటకాలు ఉండవని, చెప్పింది చేసి చూపిస్తానని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. శుక్రవారం దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ రోజంతా వివిధ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపారు. వాల్టర్ వాషింగ్టన్ కనె్వన్షన్ సెంటర్‌లో జరిగిన లిబర్టీ బాల్ డ్యాన్స్ కార్యక్రమంలో ట్రంప్ సతీమణి మెలానియాతో కలిసి ప్రథమ జంట హోదాలో తొలిసారిగా పాల్గొన్నారు. ప్రముఖ అమెరికన్ గాయకుడు ఫ్రాంక్ సింట్రా పాడిన ‘ఐ డిడ్ ఇట్ ఇన్ మై వే’ గీతానికి అనుగుణంగా వారు డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేయడానికి ముందు ట్రంప్ ఆహూతులనుద్దేశించి మాట్లాడుతూ, తమ ప్రయాణం ప్రారంభమైనప్పుడు తాము గెలిచే అవకాశాలు లేవని ప్రత్యర్థులు అన్నారని, అయితే తాము గెలిచి చూపించామని, ఈ రోజు తమకు మరిచిపోలేని గొప్పరోజని అన్నారు. ఇంతకుముందు తన పట్ల సదభిప్రాయంతో లేనివాళ్లు ఇప్పుడు తాను మంచి పని చేశానని అంటున్నారని, తాను దాన్ని గౌరవిస్తానని, ఈ రోజు ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన జనం అనూహ్యమైనదని అన్నారు.
ఓవల్ ఆఫీస్‌లో మార్పులు
వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టిన కొద్ది గంటల్లోనే ట్రంప్ ఓవల్ ఆఫీసులో భారీ మార్పులు చేశారు. గతంలో బరాక్ ఒబామా తొలగించిన బ్రిటీష్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠింపజేశారు. 2009లో ఈ విగ్రహాన్ని తొలగించినందుకు ఒబామాపై పెద్దఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఒబామా ఏర్పాటు చేసిన మార్టిన్ లూథర్ కింగ్ విగ్రహాన్ని మాత్రం ట్రంప్ అలాగే కొనసాగించారు. దీనితోపాటుగా కార్యాలయంలోపల చిన్న చిన్న మార్పులు కూడా చేశారు. అధ్యక్షుడిగా ట్రంప్ తొలి రోజు పలు కీలక నియామకాలకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు. రక్షణ మంత్రిగా రిటైర్డ్ జనరల్ జేమ్స్ మటిస్ నియామకానికి సంబంధించి గత వారం అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన తీర్మానంపై సంతకం చేశారు. మటిస్ మెరైన్ కార్ప్స్‌నుంచి 2013లో రిటైరయ్యారు. రిటైరయినవారు ఈ పదవి పొందడానికి ప్రస్తుత చట్టం అనుమతించదు. అయితే అమెరికా కాంగ్రెస్ ఆయన విషయంలో మినహాయింపు ఇచ్చింది.
ట్విట్టర్ ఖాతాకు భారీగా ఫాలోవర్లు
అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ట్రంప్ అధికారిక ట్విట్టర్ ఖాతాకు దాదాపు 5 మిలియన్ ఫాలోవర్లు వచ్చి చేరారు. అధ్యక్షుడైన 12 గంటల్లోపే ఆయన ట్విట్టర్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరింది. శనివారం ఉదయం బరాక్ ఒబామా అధ్యక్షుడి అధికారిక ట్విట్టర్ ఖాతాను ట్రంప్‌కు అప్పగించారు. ఒబామా ఉన్నప్పుడు చేసిన ట్విట్టర్లను వేరేఖాతాలో భద్రపరిచారు.
భారతీయుల సంబరాలు
ట్రంప్ బాధ్యతలు చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్‌లో ఏర్పాటు చేసిన భారీ వేడుకలకు దేశం నలుమూలలనుంచి పెద్దసంఖ్యలో భారతీయ సంతతికి చెందినవారు హాజరయ్యారు. ఆసియన్ పసిఫిక్ అమెరికన్ అడ్వైజరీ కౌన్సిల్, నేషనల్ కమిటీ ఆఫ్ ఆసియన్ అమెరికన్ రిపబ్లికన్స్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ వేడుకలకు అమెరికాలో భారత రాయబారి నవ్‌తేజ్ సర్నాతోపాటుగా పలు ఆసియా దేశాలకు చెందిన రాయబారులు కూడా హాజరయ్యారు.

భారత-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో అమెరికాలోని భారతీయులు ఎలా కీలకపాత్ర పోషిస్తున్నారో తనకు బాగా తెలసునని ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్నా అన్నారు.

వాషింగ్టన్‌లోని వాల్టర్ ఇ కనె్వన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భార్య, కుమార్తెలతో ట్రంప్