అంతర్జాతీయం

దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 21: శుక్రవారం ఓ వైపు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే మరోవైపు ఆయనకు వ్యతిరేకంగా వాషింగ్టన్‌లో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు జరిపారు. ఆందోళనకారులు పెద్దఎత్తున రాళ్లు రువ్వడం, వాహనాలకు నిప్పుపెట్టడం లాంటి చర్యలకు పాల్పడ్డంతో పోలీసులు 200 మందికిపైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఈ దాడుల్లో దాదాపు అరడజను దుకాణాలు ధ్వంసం కాగా, ఆరుగురు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. ఆందోళనకారులు అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ పరేడ్‌కు కొద్ది దూరంలోనే ఒక లిమోసిన్ కారుకు నిప్పుపెట్టారు. ఆందోళనకారుల దాడినుంచి ప్రజలను, ఆస్తులను కాపాడడానికి పెప్పర్ స్ప్రే, జనాన్ని కంట్రోల్ చేసే ఇతర పరికరాలను వాడాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. న్యూయార్క్, సీటెల్, డల్లాస్, చికాగో, పోర్ట్‌లాండ్, ఒరెగాన్ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సైతం ప్రదర్శనలు జరిగాయి.
ఫౌండేషన్‌ను ప్రారంభించిన ఒబామా
ఎనిమిదేళ్లపాటు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన బరాక్ ఒబామా పదవినుంచి వైదొలిగాక ఒక ఫౌండేషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో బరాక్ ఒబామా ఈ విషయం తెలియజేశారు. నగరంలో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రాజెక్టులకు తోడ్పాటునందించేందుకు తాను, మిషెల్ కలిసి ఒక ఫౌండేషన్‌ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

ఎనిమిదేళ్లు వైట్‌హౌస్‌లో గడిపిన తర్వాత తాను, తన భార్య సాధారణ పౌరులలాగా తిరిగి మీతో చేరుతున్నామని ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అన్నిటికన్నా ముందు తాము ఓ చిన్నపాటి బ్రేక్ తీసుకోబోతున్నామని, తిరిగివచ్చాక మామూలుగా మీతో టచ్‌లో ఉంటానని ఆయన తన అభిమానులకు తెలిపారు. తన వ్యక్తిగత వెబ్‌సైట్ ‘ఒబామా.ఒఆర్‌జి’కి అనుసంధానం కావడానికి సంబంధించిన లింక్‌ను సైతం ఒబామా ట్వీట్ చేశారు.

ట్రంప్‌కు వ్యతిరేకంగా వాషింగ్టన్‌లో ప్రదర్శనలు నిర్వహిస్తున మహిళలు