జాతీయ వార్తలు

ఇక జోరుగా జల్లికట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 21: మూడేళ్ల నిషేధం తరువాత తమిళనాట జల్లికట్టుకు రంగం సిద్ధమైంది. రాష్టప్రతి సిహెచ్ విద్యాసాగర్‌రావు శనివారం ఆర్డినెన్స్‌పై సంతకం చేశారు. దీంతో జల్లికట్టు క్రీడ మదురైలో ఆదివారం నిర్వహించనున్నారు. తమిళుల సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిన ఈ క్రీడా నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి ఒ పన్నీర్ సెల్వం శనివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. సిఎం మదురైలో పర్యటించి మరీ ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి పన్నీర్ సెల్వం కృతజ్ఞతలు తెలిపారు. ‘తమిళనాడు ప్రభుత్వం, ప్రజల పక్షాన మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా మనోభావాలను గుర్తించి జల్లికట్టుకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు. తమిళ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు నిజమైన గుర్తింపు లభించింది’ అని మోదీకి రాసిన లేఖలో సిఎం స్పష్టం చేశారు. కాగా తమిళుల ప్రయోజనాలను భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని అధికార అన్నాడిఎంకె హెచ్చరించింది. ‘మా ప్రాంత ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీపడబోం. కేంద్రం ఇచ్చిన హామీలు అమలుచేసి తీరాల్సిందే’ అని అన్నాడిఎంకె ఎంపీల బృందం పేర్కొంది. తమిళుల మనోభావాలను గౌరవిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చిన ప్రధాని మోదీ, రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీలకు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కావేరీ జలాల వివాదం, ముల్లైపెరియార్, కచ్చతీవు, తమిళ జాలర్ల, శ్రీలంక తమిళుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ అడిగామని తంబిదురై వెల్లడించారు. జల్లికట్టు ఉద్యమంలో పాల్గొన్నవారందరికీ నటుడు కమల్‌హసన్ అభినందనలు తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా ఐదు రోజులపాటు ఉద్యమంలో పాల్గొన్నవారికి తాను అభిమానినని ఆయనో ప్రకటనలో పేర్కొన్నారు. ‘మీ పోరాట పటిమ ఎంతో గొప్పది. అందరికీ స్పూర్తిదాయకం. ముఖ్యంగా విద్యార్థుల తెగువ అజరామరం’ అని కమల్ తన ట్విట్టర్‌లో స్పష్టం చేశారు. తమిళులను చూసి యావత్ భారతదేశం గర్విస్తోందని ఆయన అన్నారు. ఇలావుండగా, జల్లికట్టకు శాశ్వత పరిష్కారం లభించేంతవరకు ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని ఆందోళనకారులు వెల్లడించారు.