జాతీయ వార్తలు

మనమే మన బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: భిన్నాభిప్రాయాలు, ఆలోచనలు, సిద్ధాంతాలు కలగలిసి రాణిస్తున్న ప్రజాస్వామ్య శక్తి భారత దేశానిదని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే అంతర్గత బలిమిగా భారత దేశం పురోగమిస్తోందని 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో స్పష్టం చేశారు. బుధవారం రాత్రి జాతినుద్దేశించి మాట్లాడిన రాష్టప్రతి పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ఆర్థిక పారదర్శకత మరింత ఇనుమడిస్తుందన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించిన ఆయన సైన్యం, పారామిలటరీ, అంతర్గత భద్రతా సిబ్బందికి గణతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 1947లో స్వాతంత్య్రం వచ్చినా 1950 జనవరి 26 వరకూ రాజ్యాంగ బద్ధమైన పాలనా విధానం భారత్‌కు లేదన్నారు. సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం, సమైక్యత, సమగ్రతలే ధ్యేయంగా భారతీయులు సొంత రాజ్యాంగాన్ని, పాలనా విధానాన్ని రూపొందించుకున్నారన్నారు. 1950లో కేవలం 360 మిలియన్లు మాత్రమే ఉన్న 130 కోట్లకు చేరిన జనాభాతో బలోపేతమైందన్నారు. ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే దశ నుంచి ఆహార పదార్ధాలను ఎగుమతి చేస్తున్న ప్రధాన దేశాల్లో ఒకటిగా మారిందని ప్రణబ్ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల తాత్కాలికంగా వృద్ధి వేగం తగ్గినా కచ్చితంగా ఆర్థికపరమైన పారదర్శకత మెరుగవుతుందన్నారు. ఈ ఆరున్నర దశాబ్దాల భారత ప్రయాణం అన్ని పార్శ్వాలనూ చవిచూసిందని, ఉత్సాహంగా, ఉత్తేజంగా ముందుకు దూసుకుపోతోందని అన్నారు. అయితే మార్పులకు అనుగుణంగా మారుతూ చాకచక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక, సాంస్కృతిక, భాష, మత పరమైన వైవిధ్యమే భారత దేశ శక్తియుక్తులకు తార్కాణాలన్నారు. దేశ సంప్రదాయం అర్థవంతమైన వాదనా పటిమే తప్ప అసహనం కాదన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 66శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడం బలంగా వేళ్లూనుతున్న ప్రజాస్వామ్య పటిష్ఠతకు నిదర్శనమన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అర్థవంతమైన చర్చకు బదులు గందరగోళ పరిణామాలు చోటు చేసుకోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. గుణాత్మకమైన చర్చ జరిగేలా ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, ఇందుకు సమిష్టి ప్రయత్నం జరిగి తీరాలని ప్రణబ్ ఉద్ఘాటించారు. లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకుంటూ మందుకెళ్లాలని, విశ్వసనీయతే గీటురాయిగా ప్రజాస్వామ్యం మరింత వనె్నదేరాలని పిలుపునిచ్చారు.