జాతీయ వార్తలు

ఉగ్రవాదంపై కలిసి పోరాడుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/వాషింగ్టన్, జనవరి 25: భారత్ తమకు నిజమైన మిత్రదేశమని, భాగస్వామి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. అధ్యక్షుడి హోదాలో ట్రంప్ మోదీకి ఫోన్ చేసి మాట్లాడడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఇరువురు నేతలు అనేక అంశాలపై కొద్ది సేపు చర్చించారు. ముఖ్యంగా ఉగ్రవాదంపై భుజంభుజం కలిపి పోరాడాలని, రక్షణ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా అమెరికాను సందర్శించాలని మోదీని ట్రంప్ ఆహ్వానించగా, భారత్ సందర్శనకు రావాలని ట్రంప్‌ను మోదీ ఆహ్వానించారు. ‘ భారత్‌ను అమెరికా నిజమైన మిత్రుడిగా, భాగస్వామిగా గుర్తిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే సవాళ్లను కలిసి ఎదుర్కొంటాం. ఇదే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీతో చర్చించారు’ అని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి అందుబాటులో ఉన్న అవకాశాలను ఇరువురు నేతలు చర్చించారు. ముఖ్యంగా ఆర్థిక, రక్షణ రంగాలపై చర్చించారు. ఇదే కాకుండా దక్షిణ, మధ్య ఆసియాలో భద్రతా పరిస్థితిపైనా వారు చర్చించారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా జరుపుతున్న పోరాటంలో భారత్, అమెరికాలు భుజం భుజం కలిపి పోరాడాలని ట్రంప్, మోదీలు నిర్ణయించారని వైట్‌హౌస్ ఆ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా అమెరికాలో పర్యటించాలని మోదీని ట్రంప్ కోరగా, భారత్ సందర్శించాలని ట్రంప్‌ను మోదీ ఆహ్వానించారు.