జాతీయ వార్తలు

పాతికేళ్లు.. మూడుసార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 25: వైద్య వృత్తిలో రాణించాలనుకునే వేలాది మందికి తీపి కబురు! వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశించేందుకు నిర్వహించే జాతీయ నీట్ పరీక్షను పాతికేళ్లు వచ్చే వరకూ మూడు సార్లు రాసుకునే అవకాశం కల్పించారు. పాతికేళ్లు దాటినా, మూడు ప్రయత్నాలూ పూర్తయినా నీట్ రాసే అవకాశం ఉండదు. పరీక్ష పాసయ్యే వరకూ వయసుతో నిమిత్తం లేకుండా ఎన్నిసార్లయినా రాయాలనుకునే నిబద్ధత లేని వారికి కళ్లెం వేయడానికే ఈ పరిమితి విధించారు.్ఢల్లీలో జరిగిన యుజిసి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వైద్య, డెంటల్ రంగాల్లో తమ ప్రతిభను చాటుకోవాలనుకునే అభ్యర్ధులకు పాతికేళ్లు వచ్చే వరకూ మూడు సార్లు నీట్ పరీక్ష రాసుకునే అవకాశం ఎంతగానో ఉపయోగపడేదేనని భావిస్తున్నారు. నీట్ రాసేందుకు కనీస వయసు 17 సంవత్సరాలు. ఓపెన్ కేటగిరీలో 25 సంవత్సరాలు, రిజర్డ్ కేటగిరీలో 30ఏళ్లు వచ్చే వరకూ ఈ పరీక్ష రాయవచ్చు. ఇప్పటి వరకూ నీట్ రాయడానికి గరిష్ఠ వయోపరిమితి లేదు.ఎన్ని సార్లు రాయవచ్చునన్న దానిపైనా స్పష్టత లేదు.