జాతీయ వార్తలు

పన్నుల వాటా పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే వివిధ రకాల పన్నుల నుండి తెలంగాణ వాటా కింద 16,505.09 కోట్ల రూపాయలు లభించాయి. గత సంవత్సరం వాటా కేటాయింపులతో పోలిస్తే ఇది 1,628.41 కోట్లు అధికం. తెలంగాణకు గత సంవత్సరం కేంద్ర పన్నుల వాటా కింద 14,876.61 లభించటం తెలిసిందే. తెలంగాణకు ఈ సంవత్సరం కేంద్ర పన్నుల నుండి 2.437 శాతం నిధులు లభించాయి. కార్పొరేషన్ పన్ను వాటా కింద 4,859.14 కోట్లు, ఆదాయం పన్ను వాటా కింద 4,248.14 కోట్లు, ఆస్తి పన్ను వాటా కింద 0.15 కోట్లు, కస్టమ్స్ డ్యూటీ వాటా కింద 2,319.24 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ వాటా కింద 2,424.26 కోట్లు, సేవల పన్నుల వాటా కింద 2,654.39 కోట్లు తెలంగాణకు లభించాయి. ఆస్తుల నిర్మాణం పద్దు కింద సాలార్‌జంగ్ మ్యూజియంకు రెండు కోట్ల యాభై లక్షలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు పది కోట్లు కేటాయించగా ఎస్సీ సంక్షేమం పద్దు కింద వీటికి రూ.కోటి ఇచ్చారు. గిరిజన సంక్షేమం పద్దుల కింద ఐఐటి హైదరాబాద్‌కు ఐదు కోట్లు, విదేశీ సంస్థలు ఇచ్చే ఆర్థిక సహాయం కింద ఆంధ్రా, తెలంగాణల్లో చేపట్టిన మున్సిపల్ అభివృద్ధి ప్రాజెక్టుకు 390 కోట్లు, ఆంధ్రా, తెలంగాణ రహదారుల ప్రాజెక్టుకు రెండు వందల కోట్లు, తెలంగాణ గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టుకు 150 కోట్లు ఇచ్చారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు కింద ఆంధ్రా, తెలంగాణలో ఏర్పాటు చేయాలనుకుంటున్న గ్రామీణ విశ్వవిద్యాలయాల ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు రూ.కోటి కేటాయించారు.
స్వయంప్రతిపత్తి సంస్థలకు ఇచ్చే గ్రాంట్ల పద్దు కింద సాలార్‌జంగ్ మ్యూజియంకు రూ.27.40 కోట్లు, ఐఎన్‌సిఓఐఎస్‌కు 30.05 కోట్లు, ఆంధ్రా,తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయాలకు 20 కోట్లు, హైదరాబాద్ ఐఐటికి 75 కోట్లు, హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డిఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్, డయాగ్నస్టిక్ కేంద్రానికి రూ. 38.20 కోట్లు, జాతీయ పశు బయోటెక్నాలజీ కేంద్రానికి రూ. 64.80 కోట్లు ఇచ్చారు.