ఆంధ్రప్రదేశ్‌

అమరావతికి జైట్లీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలధన లాభాల్లో పన్ను మినహాయింపు రైతుల సంబరాలు
బాబుకు అభినందన సచివాలయం వద్ద పండుగ వాతావరణం

న్యూఢిల్లీ/గుంటూరు/తుళ్లూరు, ఫిబ్రవరి 1:ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు మూలధన లాభాల్లో పన్ను మినహాయింపు ఇచ్చారు. దీంతో అమరావతిలో రైతుల సంబరాలు మిన్నంటాయి. సచివాలయం ముందు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచారు. ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్‌సభలో ప్రతిపాదించిన 2917-18 వార్షిక బడ్జెట్‌లో ఒక ప్రకటన చేస్తూ, రాజధానిలో స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు మూలధన లాభాల్లో పన్ను మినహాయిస్తున్నట్టు తెలిపారు. జైట్లీ ఈ ప్రకటన చేయగానే సభలో ఉన్న తెలుగుదేశం సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో 29 గ్రామాలకు చెందిన 21,500మంది రైతులనుంచి 33,500 ఎకరాలు సమీకరించింది. వ్యవసాయ భూములుగా అమ్మకాలు జరిపితే ఎలాంటి పన్నుల నిబంధనలు వర్తించవు. అయితే లే-అవుట్లు, ప్లాట్లు, వాణిజ్య సముదాయాలకు భూమిని వినియోగించడంతో 20 శాతం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. దీంతో ఒక్కో రైతు ఎకరానికి 3 నుంచి 5 లక్షల వరకు నష్టపోతారు. ఈ నేపథ్యంలో భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ గెయిన్, ఆదాయపన్ను మినహాయించాలని ఎప్పటినుంచో రాజధాని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా బడ్జెట్‌లో వెసులుబాటు కల్పించడం రైతులకు సంతోషాన్నిచ్చింది.
అమరావతి రైతులు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబును కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కలసి కృతజ్ఞతలు తెలిపారు. సిఎంను అభినందనలతో ముంచెత్తారు. పన్ను మినహాయింపు వల్ల దాదాపు 900 కోట్ల రూపాయల వరకూ రైతులకు మేలు చేకూరుతుందని అంచనా. సిఎంను అభినందించిన వారిలో తుళ్లూరు ఎంపిపి పద్మావతి, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, తదితరులు ఉన్నారు.
తుళ్లూరు మండలంలో అన్ని గ్రామాల నుండి రైతులు పెద్ద సంఖ్యలో సచివాలయం వద్దకు చేరుకుని బాణాసంచా కాల్చుతూ, స్వీట్లు పంపిణీ చేసుకుని పరస్పరం అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌పై మినహాయింపువస్తుందో, రాదోనని సందిగ్ధంలో ఉన్న రాజధాని ప్రాంత రైతులకు తీపి కబురు అందిందన్నారు. ఎంపిపి వడ్లమూడి పద్మలత మాట్లాడుతూ రాజధాని రైతుల త్యాగానికి ఫలితం లభించిందన్నారు. రాజధాని రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు దామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ముఖ్యమంత్రిపై నమ్మకంతో భూములిచ్చినందుకు ట్యాక్స్ మినహాయింపు లభించడం శుభసూచకమన్నారు

చిత్రం... ముఖ్యమంత్రి చంద్రబాబును సత్కరిస్తున్న
రాజధాని ప్రాంత రైతులు