జాతీయ వార్తలు

యువశక్తికి మరింత పదును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: నాణ్యమైన విద్య ద్వారానే దేశంలో యువశక్తికి పదును పెట్టవచ్చని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేస్తూ దేశంలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకు రావడానికి పలు చర్యలను ప్రకటించారు. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం నిర్వహించే అన్ని ప్రవేశ పరీక్షలకోసం ఒక జాతీయ టెస్టింగ్ ఏన్సీని ఏర్పాటు చేయడం దీనిలో ప్రధానమైనది. ఉన్నతవిద్యా సంస్థల్లో ప్రవేశం కోసం అన్ని ప్రవేశపరీక్షలను నిర్వహించడం కోసం ఒక స్వయంప్రతిపత్తికలిగిన, స్వయం పోషకత్వంతో కూడిన టెస్టింగ్ ఏజన్సీని ఏర్పాటు చేయడం జరుగుతుందని బుధవారం పార్లమెంటులో 2017-18 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పిస్తూ జైట్లీ ప్రకటించారు. దీనివల్ల ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న సిబిఎస్‌ఇ, ఏఐసిటిఇలాంటి జాతీయ సంస్థలకు ఆ భారం దూరమయి అవి మరింతగా విద్యపైన దృష్టిపెట్టడానికి వీలవుతుందని జైట్లీ చెప్పారు. అంతేకాకుండా పాఠశాలలనుంచి వచ్చే విద్యార్థుల నైపుణ్యాలను అంచనా వేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అలాగే సెకండరీ ఎడ్యుకేషన్‌కు ఒక ఇన్నోవేషన్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తారు. విద్యాపరంగా వెనుకబడిన 3,479 బ్లాక్‌లలో ఈ నిధిని వెచ్చించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందింపజేస్తారు. యుజిసి సంస్కరణల్లో భాగంగా కొత్త కళాశాలలను గుర్తించి వాటికి ర్యాంకింగ్స్‌తో పాటుగా మరింత స్వేచ్ఛను ఇస్తారు.