జాతీయ వార్తలు

బడాబాబులకే అచ్ఛేదిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హత్రాస్, ఫిబ్రవరి 8: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మోదీ చెబుతున్న అచ్ఛేదిన్ దేశంలోని కొద్దిమంది పేదలకే వర్తిస్తుందని రాహుల్ ఎద్దేవా చేశారు. ‘మోదీ అచ్ఛేదిన్ హామీ నిజం చెప్పాలంటే పారిశ్రామికవేత్తలకే. రైతులకు ప్రయోజనం చేయదు’ అని బుధవారం ఆయన విరుచుకుపడ్డారు. బంగ్లా కాలేజీలో ఎన్నికల సభలో ప్రసంగిస్తూ దేశంలోని రైతులందరూ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. రైతులకు చెడ్డరోజులేనని ఆయన విమర్శించారు. గిట్టుబాటు ధరలు, కరవుకాటకాలతో కొట్టుమిట్టాడుతూ నష్టాల ఊబిలో చిక్కుకున్నారని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎస్‌పి, కాంగ్రెస్ కూటమి ఘనవిజయం సాధిస్తుందన్న ధీమా ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా తమకు అనుకూల గాలులే వీస్తున్నాయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పేర్కొన్నారు. హత్రాస్ ప్రాంతం బంగాళా దుంపలకు ప్రసిద్ధి అని, అయితే పెద్దనోట్ల రద్దు తరువాత రైతులు కుదేలైపోయారని రాహుల్ విమర్శించారు.

ఉత్తరాఖండ్‌లో రెట్టింపైన
సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అరవై మంది సిట్టింగ్ ఎమ్మెల్యే సగటు ఆస్తులు ఈ ఐదేళ్లలో 96 శాతం పెరిగాయి. వివిధ పార్టీల తరుఫున అరవై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తాజా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సగటు ఆస్తులు దాదాపు రెట్టింపు అయ్యాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడిఆర్) అనే సంస్థ నివేదించింది. 2012 ఎన్నికల్లో 1.85 కోట్లు ఉండగా ప్రస్తుతం 3.62 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఏడిఆర్ ఈ వివరాలు వెల్లడించింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌తోసహా 60 మంది ఎమ్మెల్యేలు మళ్లీ బరిలో ఉండగా సగటు సంపద 1.77 కోట్లు (రూ. 1,77,25,289) పెరిగిందని తెలిపారు. ఇది 96 శాతమని ఏడిఆర్ నివేదించింది. వీరిలో బిజెపి ఎమ్మెల్యే శైలేంద్ర మోహన్ సింఘాల్ అగ్రస్థానంలో ఉన్నారు. 2012 ఎన్నికలతో పోల్చుకుంటే 32 కోట్ల రూపాయల ఆస్తులు పెరిగాయి.
అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నవ్‌ప్రభాత్ ఆరు కోట్లు, బిజెపి అభ్యర్థి రేఖా ఆర్య ఆరుకోట్ల మేరకు ఆస్తులు పెరిగాయని ఏడిఆర్ పేర్కొంది. ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఆస్తుల్లో కోటి రూపాయలు పెరిగాయి. ఇక బిజెపికి చెందిన 29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తుల పెంపురెండుకోట్ల రూపాయల పేమాటే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 28 మంది సగటు పెంపు సగటున కోటి రూపాయలు.