జాతీయ వార్తలు

అభివృద్ధి వనవాసానికి ఇక ముగింపు చెబుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘజియాబాద్, ఫిబ్రవరి 8: ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధి వనవాసానికి ముగింపు పలకాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓటర్లకు పిలుపునిచ్చారు. అఖిలేశ్ యాదవ్ సర్కార్ అవినీతి, నేరాలను ప్రోత్సహిస్తూ, వాటికి సురక్షిత స్థావరంగా యూపిని మార్చేసిందని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. పధ్నాలుగు సంవత్సరాలుగా యూపిలో అభివృద్ధి కనపడకుండా పోయిందని ఆయన అన్నారు. ఘజియాబాద్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఆశలతో అఖిలేశ్‌ను యూపి ప్రజలు అందలమెక్కిస్తే ఆయన వారి ఆశలను నీరుగార్చారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సమాజ్‌వాది పార్టీ పరిస్థితి మునిగిపోతున్న నావలా మారిందని ఆయన అన్నారు. ‘ఈ ఎన్నికలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికా లేక కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవటానికా? ఈ ఎన్నికలు పధ్నాలుగేళ్లుగా రాష్ట్రానికి దూరంగా వనవాసం చేస్తున్న అభివృద్ధిని తిరిగి తీసుకువచ్చేందుకు. యూపిని ప్రగతి సౌభాగ్యం వైపు నడిపించేందుకు’ అని మోదీ పేర్కొన్నారు. దాదాపు 45 నిమిషాలపాటు సాగిన తన ప్రసంగంలో మోదీ అఖిలేశ్ సర్కార్‌పై పలు అంశాలలో విరుచుకుపడ్డారు. ‘అఖిలేశ్ అధికారంలోకి వచ్చినప్పుడు మనమంతా ఎంతో ఆశపడ్డాం. అతను యువకుడు, విద్యావంతుడు, రాష్ట్రానికి ఎంతోకొంత మంచి చేస్తాడని ఆశించాం. కానీ మనకు నిరాశే మిగిలింది. అయిదేళ్లలో యూపిని విధ్వంసం చేశారు’ అని మోదీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌ను ఉత్తమ్ ప్రదేశ్‌గా మార్చాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు.
‘వాళ్లు నామీద దాడి చేస్తున్నారు. నిందలు వేస్తున్నారు. ఎందుకంటే నేను హామీలను ఇవ్వను. 2019లో ప్రజలకు జవాబు చెప్తాను’ అని అన్నారు. ‘ఇవాళ రాత్రయితే మహిళలు బయటకు రావటానికి భయపడుతున్నారు. శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి. అధికార పార్టీ పోలీసులను తన నియంత్రణలో ఉంచుకుంది. ఆయుధాల చట్టం కింద ఈ రాష్ట్రంలో 40వేల ఫిర్యాదులు నమోదయ్యాయి. మధ్యతరగతి ప్రజల భూములను లాక్కుంటున్నారు. నేను మీకు హామీ ఇస్తున్నా- రైతులు, మధ్యతరగతి ప్రజల భూములను లాక్కున్న భూములను తిరిగి ఇప్పించేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తాం’ అని మోదీ వివరించారు.

పెరగనున్న ‘ఉపాధి’ వేతనాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఇజిఎ) కింద వేతనాలు పెరగనున్నాయి. గ్రామీణ పేదలకు ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలు పెంచే ప్రతిపాదనను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ పరిశీలిస్తోంది. జీవనవ్యయం పెరుగుతున్న దృష్యా ఉపాధి కూలీల వేతనాలు పెంచాలని యోచిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఉపాధి హామీ పథకం వేతన సవరణకు సంబంధించి ఎస్ మహేంద్రదేవ్ కమిటీ చేసిన సూచనలు, సలహాలు పరిశీలిస్తున్నట్టు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి అమర్‌జీత్ సిన్హా స్పష్టం చేశారు. దీనిపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అలాగే ఏటా వేతనాల సవరణ జరగాలని ప్యానల్ కమిటీ సూచించిందని ఆయన అన్నారు. కాగా ఉపాధి కూలీల వేతనాలు పెంపునకు సంబంధించిన ప్రతిపాదన గ్రామీణ మంత్రిత్వశాఖ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు పంపినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. ఉపాధి హామీ పథకం కింద వివిధ రాష్ట్రాల్లో ఇస్తున్న కూలీ రేట్లు వివరించారు. జార్ఖండ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, బిహార్‌లో 167 రూపాయలు, హర్యానాలో 259 రోజువారీ వేతనంగా చెల్లిస్తున్నారు. 2017-18 కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి ఇతోధికంగా నిధులు కేటాయించారు. గత బడ్జెట్‌లో 38,500 వేల కోట్ల రూపాయలు ఉండగా ఈ ఆర్థిక సంవత్సరానికి 48,000 వేల కోట్లకు పెంచారు.