జాతీయ వార్తలు

విపక్షాలు కలిసిరావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: అవినీతి, నల్లధనంపై జరుగుతున్న పోరాటంలో ప్రతిపక్షం కూడా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. నరేంద్ర మోదీ బుధవారం రాజ్యసభలో రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బదులిచ్చారు. ‘అవినీతిపై జరుగుతున్న పోరాటంలో రాజకీయం లేదు. రాజకీయ పార్టీలతో ముడివేయటం లేదు. ఇది మనందరి బాధ్యత’ అని ప్రధాని సూచించారు. సీతారాం ఏచూరి పార్టీకి మా పార్టీకి మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు ఉండొచ్చుకానీ, పెద్ద నోట్ల రద్దుపై వారు మాతో కలిసి వస్తారని ఆశించామని మోదీ అన్నారు. వాంచూ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని 1972 నవంబర్‌లోనే సిపిఎం సీనియర్ నేత జ్యోతిబసు డిమాండ్ చేశారని, నల్లధనం వ్యవహారాన్ని ఇందిర రాజకీయం చేస్తోందని ఆరోపించారని మోదీ గుర్తు చేశారు. 1982లో హరికిషన్ సింగ్ సుర్జీత్ రాజ్యసభలో మాట్లాడుతూ నల్లధనం అదుపు చేసేందుకు వంద నోటు రద్దుచేయగలరా? అని అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారని గుర్తు చేశారు. అందుకే వామపక్షాలు నల్లధనంపై తాము చేస్తోన్న పోరాటంలో కలిసి పనిచేయాలని మోదీ విజ్ఞప్తి చేశారు.
డిజిటల్ వ్యవస్థను ఇంతవరకు అమలు చేయకుంటే ఇకమీదట అమలు చేద్దామని మోదీ సూచించారు. గ్రామాల్లో వెంటనే అమలు కాకపోవచ్చు కానీ, నగరాల్లో అమలు చేయొచ్చు కదా అన్నారు. మీట నొక్కి ఓటింగ్‌లో పాల్గొంటున్న ప్రజలు, నగదురహితం కూడా కాగలరని మోదీ అన్నారు. ప్రపంచం నగదు రహితమవుతోంది. మనమూ అదే దిశగా ప్రయాణం చేయాలని పిలుపునిచ్చారు. నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి భీం ఆప్ తెచ్చామన్నారు. రిజర్వు బ్యాంకు స్వయం ప్రతిపత్తిని హరించలేదని, ఆర్బీఐని రాజకీయాల్లోకి లాగొద్దని హితవు పలికారు. ఇప్పటి వరకూ 1.6 కోట్ల పేదలకు వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, దేశం మొత్తంమీద ఐదు కోట్లమందికి ఇస్తామన్నారు. ఎన్డీయే పధకాలను వివరిస్తూ, సమాజ మార్పునకు నిర్మాణాత్మకంగా వ్యవహరించలేరా అని నిలదీశారు. ప్రతి పధకాన్ని విమర్శించటమే మీ అజెండానా? అని దుయ్యబట్టారు. స్వచ్చ్భారత్‌కు రాజకీయరహిత కృషి జరగాలన్నారు. ప్రవర్తన, ఆలోచనా విధానాల్లో మార్పుతోనే దేశంలో మార్పు కనిపిస్తుందని మోదీ సూచించారు. చిన్న చిన్న దేశాలు స్వచ్చతను సాధిస్తుంటే, మనం సాధించలేమా? అని మోదీ ప్రతిపక్షాలను ప్రశ్నించారు. మహిళల భద్రత కోసం ‘ప్యానిక్ బటన్’ పథకాన్ని త్వరలో ప్రకటిస్తామని, గిరిజన ప్రాంతాల్లో 300 ఆధునిక నగరాలు నిర్మిస్తామని మోదీ వెల్లడించారు.