జాతీయ వార్తలు

బెంగాల్ అసెంబ్లీలో రచ్చ..రచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఫిబ్రవరి 8: ఆస్తి హక్కు సవరణ బిల్లుపై బుధవారం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు రచ్చ రచ్చ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన గొడవలో ప్రతిపక్ష నాయకుడు అబ్దుల్ మన్నన్ అస్వస్థతకు లోనై ఆస్పత్రి పాలయ్యారు. ఈ బిల్లు నల్లచట్టమని, దీన్ని తీసుకురావడానికి వ్యతిరేకంగా సభలో ప్లకార్డులు ప్రదర్శించిన మన్నన్‌ను స్పీకర్ బిమన్ బెనర్జీ ఒక రోజు సస్పెండ్ చేశారు. బిల్లుపై చర్చ జరిగే దాకా వేచి ఉండాలని, ఆ తర్వాత చెప్పదలచుకున్నది చెప్పాలని స్పీకర్ చెప్పినా వినకుండా గొడవ చేస్తుండడంతో స్పీకర్ ఆయనను సస్పెండ్ చేశారు. అయితే ఆయన బైటికి వెళ్లకుండా సభలోనే బైఠాయించడంతో మార్షల్స్ ఆయనను బలవంతంగా బైటికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్ సభ్యులు వారిని అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. కాంగ్రెస్ సభ్యులకు, భద్రతా సిబ్బందికి మధ్య పెనుగులాటలో మన్నన్ అస్వస్థతకు గురికావడంతో అంబులెన్స్‌లో ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, భద్రతా సిబ్బంది తీరుపట్ల ఆగ్రహించిన కాంగ్రెస్ సభ్యులు ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి, మైకులను విరగొట్టారు. పేపర్లను చించేశారు. అనంతరం భద్రతా సిబ్బంది తీరుకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. భద్రతా సిబ్బంది తన చీర లాగేశారని, తనను తన్నడానికి ప్రయత్నించారని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే ప్రతిమా రజక్ ఆరోపించారు. అనంతరం సభ బిల్లును ఆమోదించింది.

కాగా, కాంగ్రెస్ సభ్యులు విరగ్గొట్టిన బెంచీల లెక్కలు తీసుకోవాలని స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించారు.