జాతీయ వార్తలు

మకిలి అంటని మన్మోహన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: పెద్ద నోట్ల రద్దును సంస్థాగత దోపిడీగా అభివర్ణిస్తూ తమ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై అదేస్థాయిలో ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. చుట్టూ అవినీతి కమ్ముకున్నా ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఎలాంటి మచ్చా లేకుండా బయటపడటాన్ని పరోక్షంగా తనదైన శైలిలో ప్రస్తావించారు. రాజ్యసభలో రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ ‘40 ఏళ్లుగా దేశంలోని అన్ని ఆర్థిక నిర్ణయాలతో ఆయనకు సంబంధముంది. ఆ టైంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి. అయినా ఆయనపై ఎలాంటి ఆరోపణా రాలేదు. బాత్రూంలో రెయిన్ కోటు ధరించి స్నానం చేయడంలాంటి కళ ఆయన నుంచే నేర్చుకోవాలి’ అంటూ మోదీ వ్యంగ్య బాణాలు సంధించటంతో అధికారపక్షం సభ్యులు గొల్లున నవ్వారు. మాజీ ప్రధాని మన్మోహన్‌పై మోదీ వ్యంగ్య వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహించిన కాంగ్రెస్, మధ్యలో సభనుంచి వాకౌట్ చేసింది. మోదీ దీనిపై స్పందిస్తూ ప్రభుత్వంపై ఆరోపణలు చేసే కాంగ్రెస్‌కు మా వాదన వినే ఓపిక లేదా? అని నిలదీశారు. వారు ఏ భాషలో మాట్లాడితే అదే భాషలో తామూ జవాబిస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ విశ్వాసం లేదని విమర్శించారు. నక్సలిజం, ఉగ్రవాదానికి నకిలీ నోట్లు ఉపయోగపడ్డాయని మోదీ అన్నారు. నిజాయితీపరుల ప్రయోజనాలు కాపాడాలంటే అవినీతిపరుల భరతం పట్టక తప్పదన్నారు. ఇందిర హయాంలో పెద్ద నోట్ల రద్దుకు వాంచూ కమిటీ సిఫార్సు చేస్తే, ఆమె లక్ష్యపెట్టలేదని మోదీ విమర్శించారు. డిజిటలైజేషన్‌తో అసంఘటిత కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని, టీ తోటల్లో పనిచేస్తున్న కార్మికులకూ పూర్తి వేతనం అందుతుందని మోదీ అన్నారు. నోట్ల రద్దు విఫలంపై మీరు పది ఉదాహరణలిస్తే, విజయవంతంపై మేము 20 ఉదాహరణలిస్తామని మోదీ ఖరాఖండిగా చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా ఇంత సాహసోపేత నిర్ణయం జరగలేదని, ఆర్థిక శాస్తవ్రేత్తలకు నోట్ల రద్దు ఓ కేస్ స్టడీలా ఉపయోగపడుతుందన్నారు. నోట్ల రద్దు తరువాత దేశం నిలువునా చీలిపోయిందన్నారు. ప్రజలు, ప్రభుత్వం ఒక వైపుంటే, ప్రతిపక్షం వారికి వ్యతిరేకంగా నిలబడిందని ఎద్దేవా చేశారు.
వెంకయ్య అభ్యంతరం
ప్రధాని ప్రసంగానికి అడ్డుతగులుతూ రన్నింగ్ కామెంటరీకి దిగిన రేణుకాచౌదరికి సంస్కారం లేదని సమాచార మంత్రి వెంకయ్యనాయుడు విరుచుకుపడ్డారు. పదే పదే మోదీని విమర్శిస్తుండటంతో ఆవేశంతో సీటునుంచి లేచిన వెంకయ్య ‘ప్రసంగానికి అడ్డుపడినందుకు ప్రధాని నన్ను క్షమించాలి. ప్రధాని ప్రసంగానికి పదే పదే అడ్డుతగులుతున్న కాంగ్రెస్ సభ్యురాలు రేణుకాచౌదరికి సంస్కారం లేదు’ అని ఆగ్రహించారు. ప్రధాని మోదీని హిట్లర్ అని కామెంట్ చేస్తే సహించాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేణుక సైతం వెంకయ్య విమర్శలను తిప్పికొడుతూ రన్నింగ్ కామెంటరీ కొనసాగించారు. రేణుక చౌదరి, ఆనంద్ శర్మ మరికొందరు కాంగ్రెస్ నేతలు పలుమార్లు ప్రధాని ప్రసంగానికి అడ్డుతగిలారు. మన్మోహన్‌పై మోదీ వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇదిలావుంటే, తాము ప్రతిపాదించిన సవరణలపై మాట్లాడేందుకు అనుమతివ్వలేదంటూ సిపిఐ, పెద్ద నోట్ల రద్దుతో మరణించినవారికి సంతాపం ప్రకటించాలన్న ప్రతిపాదనను నిరాకరించినందుకు తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు.