జాతీయ వార్తలు

హైడ్రామా.. హంగామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు రాష్ట్రానికి గవర్నర్ కీలక నిర్ణయంపై ఊహాగానాలు శశికళ చేతిలోనే 131మంది ఎమ్మెల్యేలు
అజ్ఞాత ప్రాంతానికి తరలింపు చివరి ప్రయత్నాల్లో పన్నీర్ సెల్వం అసెంబ్లీ పెడితే మెజార్టీ తనదేనని ధీమా
మా ప్రమేయం లేదు: బిజెపి అది అన్నాడిఎంకె అంతర్గత వ్యవహారం: స్టాలిన్

చెన్నై, ఫిబ్రవరి 8: ఎవరిది పైచేయి? అంతిమంగా ఎవరిది మెజార్టీ? ఈ ప్రశ్నలతో తమిళనాడు అట్టుడుకుతోంది. మెజార్టీ తనదేనంటున్న శశికళనే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలుస్తారా? అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తే మెజార్టీ నిరూపించుకుంటానంటూ సవాల్ విసిరిన పన్నీర్ సెల్వానే్న ఆహ్వానిస్తారా? గత మూడు రోజులుగా ముంబయిలో మకాంవేసి గురువారం చెన్నైకి గవర్నర్ విద్యాసాగర్‌రావు రానున్న దృష్ట్యా ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆయన వచ్చిన వెంటనే శశికళ తనకు మద్దతిస్తున్న మెజార్టీ ఎమ్మెల్యేల లేఖను అందించే అవకాశం కన్పిస్తోంది. అలాగే పన్నీర్ సెల్వం సైతం తన అవకాశాలను బలపర్చుకునేందుకు ప్రతి వ్యూహంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. తనకు బలం ఉందని పన్నీర్ సెల్వం చెబుతున్నా, అందులో స్పష్టత కనిపించడం లేదు. అయితే శశికళ మాత్రం 131 మంది ఎమ్మెల్యేలను తన గుప్పిట పెట్టుకున్నారు. క్షణం ఆలస్యం లేకుండా గవర్నర్ ముందు ఆమె చక్రం తిప్పే అవకాశం కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఏవిధంగా వ్యవహరిస్తారన్నదే గురువారం కీలకం కాబోతోంది. అయితే, మూడు రోజుల తరువాత చెన్నై వస్తున్న గవర్నర్ అనుసరించబోయే వ్యూహం ఏమిటన్నది అంతుబట్టడం లేదు. శశికళను అధికార అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నుకున్నా, ఆమెచేత గవర్నర్ ఎందుకు ప్రమాణ స్వీకారం చేయించలేదన్నది కూడా అనేక ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చింది. వచ్చేవారం ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన కేసులో శశికళ ప్రమేయంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువడనున్న దృష్ట్యా, ఆమెచేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే విషయంలో న్యాయమూర్తుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసిన వెంటనే తన మద్దతుదారులను పొయెస్ గార్డెన్‌కు పిలిపించిన శశికళ, బుధవారం తన వెంటనున్న ఎమ్మెల్యేలను ప్రదర్శించారు. మెజార్టీ సభ్యుల మద్దతు తనదేనన్నారు. పన్నీర్ సెల్వం డిఎంకెతో చేతులు కలుపుతున్నారన్న విషయం కొద్దిరోజుల ముందే తనకు తెలుసునని శశికళ వ్యాఖ్యానించారు. అన్నాడిఎంకెను పరిరక్షించడమే ధ్యేయంగా తాను ముందుకెళ్తున్నట్టు చెప్పారు. అనంతరం విధేయ ఎమ్మెల్యేలను గుర్తు తెలియని ప్రాంతానికి బస్సుల్లో తరలించారు. తమ మద్దతుదారులను ఎవరూ లోబర్చుకోకుండా ఉండేందుకే ముందస్తు వ్యూహంతో శశికళ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. మరోపక్క శశికళ చేత ప్రమాణ స్వీకరాం చేయించే విషయంలో ఇంకా జాప్యం జరిగితే, ఏకంగా రాష్టప్రతి ముందే తన బలాన్ని నిరూపించుకునేందుకు శశికళ సిద్ధమవుతారన్న కథనాలూ వెలువడ్డాయి.
ఇదిలావుంటే, శశికళకు 131మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, నేడు జరిగిన సమావేశానికి వీరంతా హాజరయ్యారని అన్నాడిఎంకె పార్టీ ప్రతినిధి స్పష్టం చేశారు.
తమిళనాడు రాజకీయ పరిణామాల నుంచి లబ్దిపొందడమే ధ్యేయంగా బిజెపి పని చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. అందుకే రాష్ట్రం సంక్షోభంలో అట్టుడుకుతున్నా గవర్నర్‌ను చెన్నైకి రానివ్వలేదని ధ్వజమెత్తింది. కాగా తమిళనాడులో తలెత్తిన సంక్షోభం అన్నాడిఎంకె అంతర్గత వ్యవహారమని, ఇందులో కేంద్రానికిగాని, బిజెపిగాని ఏరకమైన సంబంధం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఈ సంక్షోభాన్ని రాజ్యాంగబద్ధంగా పరిష్కరించేందుకు గవర్నర్ ప్రయత్నిస్తారని తెలిపారు. ఇదిలావుండగా తమిళనాట అన్నాడిఎంకె పార్టీని పరిరక్షించాలంటూ రాష్టమ్రంతటా పోస్టర్లు వెలిశాయి. కొన్నిప్రాంతాల్లో పన్నీర్ సెల్వానే్న సిఎం చేయాలన్న డిమాండ్లూ వినిపించాయి. నేటి పరిణామాల్లో అనేకమంది పన్నీర్ సెల్వానికి మద్దతుగా నిలిచారు. ఆయనను స్వయంగా కలుసుకున్నవారిలో నటుడు, దర్శకుడు కె భాగ్యరాజ్ కూడా ఉన్నారు.

పన్నీర్ సెల్వం ద్రోహి. పార్టీకి నమ్మకద్రోహం చేశాడు. జయలలిత తన జీవితమంతా వ్యతిరేకించిన డిఎంకెతో విలీనమైపోయాడు. బెదిరింపులకు లొంగేది లేదు. పార్టీని విచ్ఛిన్నం చేయడం వెనుక డిఎంకె కుట్ర ఉంది. ఇలాంటి కుట్రలను ఎన్నింటినో చూశాను. వాటిని ముఖాముఖీ ఢీకొంటాను.
-వికె శశికళ

అన్నాడిఎంకె గొడవలతో మాకు సంబంధం లేదు. దొడ్డిదారిన ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించు కోవాలనుకున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో శశికళ అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారు.
ఎంకె స్టాలిన్

మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు నాకే ఉంది. అసెంబ్లీలోనే తగిన సమయంలో దీన్ని నిరూపించుకుంటా. ప్రస్తుతం శశికళ వైపువున్న ఎమ్మెల్యేలు త్వరలోనే వాస్తవం తెలుసుకుంటారు. జయ మరణంపై తలెత్తిన సందేహాలను తీరుస్తా. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు కమిషన్ వేయిస్తా.
-పన్నీర్ సెల్వం