జాతీయ వార్తలు

ప్రజాస్వామ్యానికే చీకటి రోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 18: తమిళనాడు అసెంబ్లీలో శనివారం విశ్వాస ప్రకటన తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా తనపైన, తమ పార్టీ ఎమ్మెల్యేలపైనా దాడికి నిరసనగా మెరీనా బీచ్‌లో ధర్నాకు దిగిన డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ‘ఈ రోజు ప్రజాసామ్యానికే బ్లాక్‌డే’ అని స్టాలిన్ అభివర్ణిస్తూ, అప్రజాస్వామిక అన్నాడిఎంకె ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరుకునే వారంతా తనతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు. మరోవైపు స్టాలిన్‌పై దాడికి నిరసనగా రాష్టవ్య్రాప్తంగా అనేకచోట్ల డిఎంకె కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతోపాటు పోలీసులపైకి రాళ్లు రువ్వారు.
విశ్వాస ప్రకటన ఓటింగ్ సందర్భంగా అసెంబ్లీ లోపల మార్షల్స్ తనపై దాడి చేసి కొట్టారని ఆరోపిస్తూ స్టాలిన్ శనివారం సాయత్రం మెరీనా బీచ్‌లోని గాంధీజీ విగ్రహం ముందు తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ధర్నాకు కూర్చున్నారు. ఈ విషయం తెలిసి పెద్దఎత్తున అభిమానులు, కార్యకర్తలు మెరీనా బీచ్‌కి చేరుకోవడంతో పరిస్థితి చేయిదాటిపోతుందని భావించిన పోలీసులు స్టాలిన్‌ను, ఇతర పార్టీ నేతలను అరెస్టు చేసి అక్కడినుంచి బలవంతంగా తరలించడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు స్టాలిన్‌ను తీసుకెళ్లనీయకుండా అభిమానులు ఆ మార్గంలో అడుగడగునా అడ్డుపడ్డారు. ఎట్టకేలకు అతికష్టంమీద పోలీసులు స్టాలిన్‌ను, ఇతర నేతలను మైలాపూర్‌లోని కుచ్చేరి సాలైలో ఉన్న కర్పగంబాళ్ కళ్యాణమండపానికి తీసుకెళ్లారు. అరెస్టు చేసిన వారినందరినీ త్వరలోనే వదిలిపెడతామని పోలీసులు చెప్పారు.
ఇదిలా ఉండగా తమిళనాడు అసెంబ్లీనుంచి డిఎంకె ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా బైటికి పంపించి వేసిన విషయం తెలియగానే రాష్టవ్య్రాప్తంగా అనేకచోట్ల పెద్దఎత్తున హింసాకాండ చెలరేగింది. డిఎంకె కార్యకర్తలు అంబూర్, రాణిపేటసహా చెన్నై-బెంగళూరు హైవేపై అనేకచోట్ల వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. తిరువణ్ణామలైలో పార్టీ కార్యకర్తలు స్పీకర్ ధనపాల్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
తిరుపూర్‌లోని అవినాశిలో స్పీకర్ ధనపాల్ కార్యాలయంపై డిఎంకె కార్యకర్తలు రాళ్లు రువ్వారు. కడలూరు జిల్లాలోని చిదంబరం, విరుదాచలం, వెప్పూర్ తదితర ప్రాంతాల్లో డిఎంకె కార్యకర్తలు రాళ్లు రువ్విన సంఘటనల్లో ప్రభుత్వ బస్సులు ధ్వంసమైనాయి. ఈ సంఘటనల్లో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పుదుచ్చేరి బస్ టెర్మినస్ వద్ద డిఎంకె కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి స్టాలిన్‌పై దాడిని ఖండిస్తూ నినాదాలు చేశారు. తంజావూరులో స్పీకర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన మాజీ కేంద్ర మంత్రి టిఆర్ బాలు సహా 300 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈరోడ్ జిల్లాలోని భవాని, గోబిచెట్టి పాళ్యం, సత్యమంగళం తదితర ప్రాంతాల్లో కూడా డిఎంకె కార్యకర్తలు పికెటింగ్ నిర్వహించారు.

శాసనసభలో జరిగిన దాడికి నిరసనగా కరూర్‌లో రాస్తారోకో చేస్తున్న డిఎంకె కార్యకర్తలు