జాతీయ వార్తలు

వచ్చేనెల 21న కోర్టుకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ఢిల్లీ క్రికెట్ సంఘం (డిడిసిఏ), మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో మార్చి 21న కోర్టు ఎదుట హాజరు కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌ను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అభిలాష్ మల్హోత్రా శనివారం ఆదేశించారు. కాగా, చికిత్సకోసం బెంగళూరులో ఉన్న కారణంగా ఈ రోజు విచారణకు హాజరు కావడంనుంచి మినహాయింపు ఇవ్వాలన్న కేజ్రివాల్ అభ్యర్థనకు మేజిస్ట్రేట్ ఆమోదం తెలిపారు. కేజ్రివాల్ ఈ నెల 22న ఢిల్లీ తిరిగి వస్తారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అనేక అవకతవకలు జరిగాయని కేజ్రివాల్ ఆరోపించడం, దానిపై జైట్లీ ఆయనపై పరువు నష్టం దావా వేయడం తెలిసిందే. ఇదే విషయంలో ఢిల్లీ క్రికెట్ సంఘం, అప్పట్లో దాని ఉపాధ్యక్షుడుగా ఉండిన చేతన్ చౌహాన్ కూడా కేజ్రివాల్‌పై పరువు నష్టం దావా వేశారు. కాగా, ఇదే కేసులో కోర్టు ఎదుట హాజరు కావాలని అదేశించిన బిజెపి మాజీ ఎంపి కీర్తి ఆజాద్‌కు కోర్టు రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తు, అంతే మొత్తానికి మరో స్యూరిటీ సమర్పించిన తర్వాత బెయిలు మంజూరు చేసింది. కేజ్రివాల్, ఆజాద్‌ల ప్రకటనలు డిడిసిఏ, దాని అధికారుల ప్రతిష్ఠను దెబ్బతీసేవిగా ఉన్నాయని పేర్కొంటూ కోర్టు గత నెల 30 ఆ ఇద్దరికీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.