జాతీయ వార్తలు

ప్రతీకారానికి ప్రజలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఝాన్సీ (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 19: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఆదివారం వారు ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ, పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో మోదీపై ప్రజలు ప్రతీకారం తీర్చుకోవడం ఖాయమని, కనుక రాష్ట్ర శాసనసభకు మూడు, నాలుగు విడతల పోలింగ్ ముగిసిన తర్వాత బిజెపి నాయకులు రక్తపోటును పరీక్షించుకోవాల్సి ఉంటుందని అన్నారు. ‘పెద్ద నోట్లను రద్దు చేసిన మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజలను తమ సొంత డబ్బుకోసం క్యూల్లో నిలబెట్టింది. ఇదే సామాన్య ప్రజలు ఇప్పుడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిజెపిపై ప్రతీకారం తీర్చుకునేందుకు క్యూల్లో నిలబడ్డారు. ఈ విషయం బిజెపి నేతలకు కూడా బాగా తెలుసు. కనుక రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మూడు, నాలుగు విడతల పోలింగ్ నిర్వహించిన తర్వాత బిజెపి నాయకులు తమ రక్తపోటును పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది’ అని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఓట్లకోసం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మోదీ మధ్య మధ్యలో నీళ్లు తాగడానికి ముందు చెమటను తుడుచుకుంటున్నారని, ప్రజలు తనకు ఏవిధంగా ముచ్చెమటలు పట్టిస్తున్నారో ఈ సందర్భంగా మోదీ ఆలోచిస్తున్నారని అఖిలేశ్ యాదవ్ అన్నారు.
అఖిలేశ్‌తో మైత్రి తర్వాత మోదీ తీరు మారిందని, యుపిలో ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలేనన్న విషయం ప్రధానికి బాగా తెలుసని, అందుకే ఇప్పుడు ఆయన చిరునవ్వులు ఆవిరైపోయాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ రాష్ట్రం ఊసెత్తని మోదీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత 2019 వరకు ఈ రాష్ట్రాన్ని కూడా మర్చిపోవడం ఖాయమని రాహుల్ అన్నారు.