జాతీయ వార్తలు

పార్లమెంటు ప్రతిష్ఠ సభ్యుల బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, ఫిబ్రవరి 19: పార్లమెంటుపై ప్రజల విశ్వాసం ఎన్నికయిన ప్రతినిధుల బాధ్యతాయుతమైన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. పార్లమెంటుపై ప్రజల విశ్వసనీయత అనేది దాని నిష్కాపట్యం, పారదర్శకత, అందుబాటులో ఉండడం, ఎన్నికయిన ప్రతినిధుల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది’ అని ఆమె అన్నారు. చట్టాలు చేయడానికి, బడ్జెట్ మంజూరుకు, కార్యనిర్వాహక వర్గం చర్యలపై నిఘాకు అధికారాలు కలిగి ఉండడంతో అభివృద్ధి ప్రక్రియలో పార్లమెంటుకు చాలా ముఖ్యమైన స్థానం ఉందని ఆదివారం ఇక్కడ ‘నిలకడైన అభివృద్ధి లక్ష్యాల’పై దక్షిణాసియా దేశాల స్పీకర్ల సదస్సు ముగింపు సమావేశంలో మాట్లాడుతూ సుమిత్రా మహాజన్ చెప్పారు. భారత పార్లమెంట్, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు దేశాల జాతీయ అసెంబ్లీల స్పీకర్లు హాజరయ్యారు.
నిలకడైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి పార్లమెంటు, పార్లమెంటు సభ్యుల శక్తి సామర్థ్యాలను సమన్వయం చేసే ఒక ప్రయత్నమే ఈ సదస్సని సుమిత్రా మహాజన్ అన్నారు. ఈ లక్ష్యాలను సాధించడానికి అడ్డంకిగా ఉన్న స్ర్తి-పురుష అసమానత్వంపై ఈ సదస్సు కూలంకషంగా చర్చించినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వాతావరణ మార్పు, ప్రకృతి విపత్తుల సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ రెండు రోజుల సదస్సులో అనేక ఉపయుక్తమైన సూచనలు వచ్చాయని కూడా ఆమె అన్నారు. మన ఉమ్మడి లక్ష్యాల దిశగా ఈ ప్రాంతం ముందుకు సాగేందుకు మన అనుబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ సదస్సు ఒక వేదిక అవుతుందన్న గట్టి నమ్మకం తనకు ఉందని సుమిత్రా మహాజన్ అన్నారు.
మహిళా రక్షణకు చట్టాలు
వివక్ష, లైంగిక వేధింపులు, అక్రమ రవాణానుంచి మహిళలకు రక్షణ కల్పించడానికి చట్టాలు తీసుకురావాలని ఏడు దక్షిణాసియా దేశాల పార్లమెంటు స్పీకర్లు నిర్ణయించారు. రెండు రోజులుగా ఇక్కడ జరుగుతున్న ఏడు దేశాల పార్లమెంటు స్పీకర్ల సమావేశం ముగింపు సందర్భంగా విడుదల చేసిన ఇండోర్ డిక్లరేషన్‌పై భారత్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, నేపాల్, మాల్దీవుల పార్లమెంటు స్పీకర్లు సంతకాలు చేశారు. ‘వివక్ష, హింస, లైంగిక వేధింపులు, అకృత్యాలు, అక్రమ రవాణానుంచి మహిళలకు రక్షణ కల్పించడానికి చట్టాలను రూపొందించేలా పార్లమెంటులను ప్రోత్సహించాలి’ అని ఆ డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. ‘మహిళా హక్కులు నిజమైన మానవ హక్కులని మేమంతా గుర్తించాం. గౌరవంగా, సమానత్వంతో జీవించే హక్కు మహిళలకు ఉంది. విద్య, ఆర్థిక వనరులు, ఉపాధి అవకాశాల్లో మహిళలకు కూడా సమాన అవకాశాలు ఉండాలి’ అని సదస్సు ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ సుమిత్రా మహాజన్ అన్నారు. మహిళలకు సమానత్వం ఇవ్వని పక్షంలో నిలకడయిన అభివృద్ధి సాధ్యం కాదని కూడా ఆమె అన్నారు. ఈ లక్ష్యాలపై చర్చించడానికి ప్రతి సమావేశాల్లోను ఒక రోజును కేటాయించాలని దక్షిణాసియా దేశాల పార్లమెంట్లను ఈ డిక్లరేషన్‌లో కోరారు.