జాతీయ వార్తలు

మరుగుదొడ్డి లేని ఇంట నిఖా జరుగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, ఫిబ్రవరి 19: మరుగుదొడ్డి లేని ఇంట్లో ఇక నిఖా (పెళ్లి) జరుగదు. అవును, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో మరుగుదొడ్డి లేని ఇంట్లో వివాహాలు జరిపించకూడదని వౌల్వీలు, ముఫ్తీలు నిర్ణయించారు. ఈ మూడు రాష్ట్రాల్లో ముస్లింల పెళ్లిళ్లు జరగాలంటే ఆయా ఇళ్లలో మరుగుదొడ్లు ఉండటం తప్పనిసరి అని జమియత్ ఉలేమా ఐ హింద్ సెక్రెటరి జనరల్ వౌలానా మహమూద్ ఎ మదాని చెప్పారు. ఈ విధానాన్ని త్వరలోనే దేశంలోని మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని చెప్పారు. ‘మరుగుదొడ్డి లేని ఇంటిలో నిఖా (వివాహం) జరిపించకూడదని హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానాల్లోని వౌల్వీలు, ముఫ్తీలు నిర్ణయించారు’ అని ఆయన వెల్లడించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు కూడా అయిన మదానీ గత వారం ఇక్కడి ఖనపరలో నిర్వహించిన అస్సాం కాన్ఫరెన్స్ ఆన్ సానిటేషన్-2017లో ఈ విషయం తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని మతాలలోని మత నాయకులు మరుగుదొడ్లు లేని ఇళ్లలో ఎలాంటి మతపరమైన, సంప్రదాయపరమైన కార్యక్రమాలు నిర్వహించకూడదని నిర్ణయించాలని తాను అభిప్రాయపడుతున్నట్టు ఆయన చెప్పారు. అస్సాంలోనే కాకుండా దేశం మొత్తంమీద స్వచ్ఛత, పారిశుద్ధ్యంకోసం ప్రజలు మరుగుదొడ్లను వినియోగించాలని మదానీ పిలుపునిచ్చారు. అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని స్వచ్ఛంగా ఉంచడం జీవిత లక్ష్యంగా భావించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సంవత్సరాంతంలోగా అస్సాంను బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఈ సదస్సు తీర్మానించింది.