జాతీయ వార్తలు

అండమాన్ దీవుల్లో మళ్లీ పేలుతున్న అగ్నిపర్వతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, ఫిబ్రవరి 19: అండమాన్, నికోబార్ దీవుల్లోని అగ్నిపర్వతం నుంచి మళ్లీ పొగలు, లావా ఉబికి వస్తున్నాయి. మన దేశంలో క్రియాశీలకంగా ఉన్న ఏకైక అగ్నిపర్వతం ఇదే. బారెన్ ఐలెండ్‌లో 150 ఏళ్ల నుంచి స్తబ్దుగా ఉన్న ఈ అగ్నిపర్వతం 1991లో బద్ధలైందని, ఆ తర్వాత నుంచి చెదురు మదురుగా పేలుళ్లు సంభవిస్తున్నాయని గోవాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్‌ఐఓ) శాస్తవ్రేత్తలు తెలిపారు. ప్రస్తుతం ఈ అగ్నిపర్వతం స్వల్పంగా పేలుతోందని, ఐదు నుంచి పది నిమిషాల పాటు చిన్న చిన్న మొత్తాల్లో పొగలు, లావా వెలువడుతున్నాయని అండమాన్ బేసిన్‌లో శాంపిళ్లను సేకరిస్తున్న ఎన్‌ఐఓ బృందం అధిపతి అభయ్ మధోల్కర్ వెల్లడించారు. శుక్రవారం పగలు ఈ అగ్నిపర్వత ముఖ ద్వారం నుంచి కేవలం బూడిద మేఘాలు మాత్రమే వెలువడ్డాయని, అయితే ఆ రోజు సూర్యుడు అస్తమించిన తర్వాత వేడి వేడి లావా కూడా ఉబికివచ్చి దిగువకు ప్రవహించిందని వివరించారు. ఆ తర్వాత మళ్లీ ఆ ప్రాంతాన్ని సందర్శించిన బి.నాగేందర్‌నాథ్ బృందం అక్కడ పేలుళ్లు కొనసాగుతూ పొగలు వెలువడుతుండటాన్ని గుర్తించిందని మధోల్కర్ తెలిపారు.