జాతీయ వార్తలు

నాలుగో ‘మలుపు’ ఎవరిదో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 21: ఉత్తరప్రదేశ్‌లో నాలుగో విడత పోలింగ్‌కు రంగం సిద్ధమయింది. 12 జిల్లాల్లో విస్తరించి ఉన్న 53 అసెంబ్లీ నియోజకవర్గాలలో గురువారం పోలింగ్ జరుగనుంది. వెనుకబడిన బుందేల్‌ఖండ్‌తో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా గురువారం పోలింగ్ జరిగే నియోజకవర్గాలలో ఉన్నాయి. 1998 తరువాత మొదటిసారిగా ఈ ఎన్నికలలో సోనియాగాంధీ ప్రచారంలో పాల్గొనలేదు. ప్రతాప్‌గఢ్, కౌషంబి, అలహాబాద్, జలౌన్, ఝాన్సీ, లలిత్‌పూర్, మహోబా, బాందా, హమీర్‌పూర్, చిత్రకూట్, ఫతేపూర్ జిల్లాలు ఈ నాలుగో విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఉన్నాయి. బాగా వెనుకబడి, తీవ్ర నీటి ఎద్దడి గల బుందేల్‌ఖండ్ ప్రాంతంలోనూ ఈ విడతలోనే పోలింగ్ జరుగనుంది. మొత్తం 680 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని మొత్తం 1.84 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఈ ఓటర్లలో 84 లక్షల మంది మహిళలు, 1,032 మంది మూడో కేటగిరి ఓటర్లు ఉన్నారు. అలహాబాద్ ఉత్తర నియోజకవర్గంలో గరిష్ఠంగా 26 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఖాగా (్ఫతేపూర్), మంజన్‌పూర్ (కౌషంబి), కుందా (ప్రతాప్‌గఢ్) నియోజకవర్గాలలో కనిష్టంగా ఆరుగురు చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2012లో జరిగిన ఎన్నికల్లో ఈ 53 సీట్లలో సమాజ్‌వాదీ పార్టీ 24, బిజెపి అయిదు, బహుజన్ సమాజ్ పార్టీ 15, కాంగ్రెస్ ఆరు, ఇతరులు మూడు స్థానాలను దక్కించుకున్నారు.
రాంపూర్ ఖాస్ (ప్రతాప్‌గఢ్) నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరాధన మిశ్రా, కాంగ్రెస్ ఎంపి ప్రమోద్ తివారి, స్వతంత్ర ఎమ్మెల్యే, మంత్రి రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా తదితరులు ఈ విడతలో పోలింగ్ జరిగే ప్రాంతాలలో పోటీ చేస్తున్న ప్రముఖుల్లో ఉన్నారు. రాజా భయ్యా తన సంప్రదాయ నియోజకవర్గమైన కుందా (ప్రతాప్‌గఢ్) నుంచి తిరిగి పోటీ చేస్తున్నారు. రాయబరేలిలో కాంగ్రెస్ టికెట్‌పై అదితి సింగ్, బిఎస్‌పి నుంచి ఫిరాయించిన స్వామి ప్రసాద్ వౌర్య కుమారుడు ఉత్కర్ష్ వౌర్య ఉంచహార్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు గయాచరణ్ దినకర్ నరైని (బాందా) స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు రేయటి రామన్ సింగ్ కుమారుడు ఉజ్వల్ రామన్ సింగ్ కర్చన (అలహాబాద్) స్థానం నుంచి బరిలో ఉన్నారు.
బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎస్‌పి చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కాలంతో పోటీ పడుతూ ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించడానికి అలహాబాద్‌లో రోడ్ షోలలో పాల్గొన్నారు.