జాతీయ వార్తలు

సివిల్స్ మెయిన్స్-2016 ఫలితాలు వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్‌లో ఉత్తీర్థులైన అభ్యర్థుల వ్యక్తిత్వ పరీక్షలు మార్చి 20 నుంచి ప్రారంభమవుతాయని యుపిఎస్‌సి బుధవారం వెల్లడించింది. సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఏటా మూడు దశల్లో యుపిఎస్‌సి నిర్వహిస్తుంది.ప్రిలిమినరీ, మెయిల్, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణులైన వారిని ఐఏఎస్,ఐఎఫ్‌ఎస్,ఐపిఎస్ తదితర విభాగాలకు ఎంపిక చేస్తారు. సివిల్స్ మెయిన్స్ 2016 డిసెంబర్ 3 నుంచి 9 వరకూ నిర్వహించారు. మెయిల్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు వయస్సు, విద్యార్హతలు, కులం, పిహెచ్‌సి వంటిని నిర్ధారించే ఒరిజినల్ సర్ట్ఫికెట్లు వ్యక్తిత్వ పరీక్షల నాటికి అందజేయాల్సి ఉంటుందని యుపిఎస్‌సి స్పష్టం చేసింది. మార్చి 20 నుంచి పర్సనాలిటీ టెస్ట్ ఉంటుందని అన్నారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.యుపిఎస్‌సి.జిఓవి.ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
కనిపిస్తే కాల్చివేత
వన్యమృగాల సంరక్షణకు
ఉత్తరాఖండ్ కఠిన నిర్ణయం
నైనిటాల్ (ఉత్తరాఖండ్), ఫిబ్రవరి 22: ఉత్తరాఖండ్‌లోని కోర్‌బెట్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో వేటగాళ్ల నుంచి వన్యమృగాలను రక్షించడానికి అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా వేటగాళ్ల కదలికలు పెరిగినట్టు సమాచారం అందిన రిజర్వ్ ఫారెస్ట్ దక్షిణ భాగంలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. వేటగాళ్ల కదలికలను కనిపెట్టేందుకు రెండు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. కీలకమైన ప్రాంతాలలో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో 150 మంది అటవీ శాఖ సిబ్బందిని మోహరించారు. కోర్‌బెట్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దక్షిణ భాగంలోకి చొరబడిన వేటగాళ్లను ఏరివేయడానికి అయిదు రోజుల ఆపరేషన్ నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా 388 కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు 150 మంది సిబ్బందిని మోహరించామని రిజర్వ్ ఫారెస్ట్ డైరెక్టర్ పరాగ్ మధుకర్ ధకాటె తెలిపారు. వన్యమృగాల సంరక్షణ కోసం ప్రభుత్వం 2003లో జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు. ఈ అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలను పశువులను మేపడానికి కీలకమైన ప్రాంతాలలోకి వెళ్లొద్దని హెచ్చరించినట్లు ఆయన తెలిపారు.
ట్రిబ్యునళ్లకు మంగళం!
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: పరిపాలన సౌలభ్యం మిషతో ఏర్పాటైన పలు ట్రిబ్యునళ్లను రద్దుచేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉన్న 36 ట్రిబ్యునళ్లను 18కి కుదించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. సమర్ధవంతంగా పనిచేస్తున్న ట్రిబ్యునళ్లను కొనసాగించవచ్చని అంటున్నారు. అయితే పూర్తిగా రద్దుచేయడమా? లేక విలీనం చేయడమా అన్నదానిపై దశలవారిగా చర్యలుంటాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ట్రిబ్యునళ్ల రద్దుకు సంబంధించి తొలుత పార్లమెంటులో బిల్లు పెట్టిన తరువాతే తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. ట్రిబ్యునళ్లను కుదించే అంశం ఇప్పుటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. గత ఏడాది పలువురు కార్యదర్శులు సమావేశమై ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు.