జాతీయ వార్తలు

సూపర్‌సోనిక్ సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాసోర్/న్యూఢిల్లీ, మార్చి 1: శత్రు క్షిపణులను మార్గం మధ్యలోనే తుత్తునియలు చేసే సామర్థ్యం కలిగిన సూపర్‌సోనిక్ ఇంటర్‌సెప్టర్ క్షిపణిని భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. పూర్తిస్థాయిలో దేశీయ సాంకేతిక విజ్ఞానంతో రూపొందించిన క్షిపణి పరీక్ష విజయవంతం కావడంతో భారత దేశ బాలిస్టిక్ క్షిపణి రక్షణకు మరింత బలం చేకూరినట్టయిందని అధికార వర్గాలు తెలిపాయి. తక్కువ ఎత్తులో ఉండే శత్రు క్షిపణలను ఈ సూపర్‌సోనిక్ క్షిపణి మార్గం మధ్యలోనే అడ్డగించి ధ్వంసం చేయగలుగుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒడిశాలోని అబ్దుల్ కలాం దీవి నుంచి జరిగిన ఈ ప్రయోగంలో ఈ క్షిపణి నిర్దేశిత ప్రమాణన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపింది. ఈ క్షిపణిని పరీక్షించడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. 15 నుంచి 25కిలోమీటర్ల ఎత్తులో ఎగిరే శత్రు క్షిపణులు దీన్నుంచి తప్పించుకోలేవని, ఈ శక్తి నేటి ప్రయోగ పరీక్షలో మరింత స్పష్టంగా రుజువైందని రక్షణ వర్గాలు వివరించాయి. ఈ పరీక్ష విజయవంతం కావడం పట్ల డిఆర్‌డిఓ శాస్తవ్రేత్తలను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అభినందించారని రక్షణ శాఖ తెలిపింది. డిఆర్‌డిఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి సతీష్ రెడ్డి పర్యవేక్షణలో ఈ పరీక్ష జరిగిందని, రక్షణ శాఖకు చెందిన సీనియర్ అధికారులు దీన్ని వీక్షించినట్టు తెలుస్తోంది. ఈ సూపర్ సోనిక్ క్షిపణి శత్రు క్షిపణిని నిరోధించి ధ్వంసం చేసే వరకూ అన్ని ప్రమాణాలూ సంతృప్తికరంగా నెరవేరాయని, దీని గమనాన్ని అనుక్షణం ‘ట్రాక్’చేశామని రక్షణ శాఖ వివరించింది.