జాతీయ వార్తలు

ఆగని హోరాహోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/పఠాన్‌కోట్ (పంజాబ్), జనవరి 3: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ రెండో రోజైన ఆదివారం కూడా కాల్పులతో హోరెత్తిపోయింది. రాత్రి పొద్దుపోయే వరకూ పేలుళ్లు, కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. సైనిక స్థావరంలో నక్కినట్లుగా భావిస్తున్న మిలిటెంట్లు తాజాగా కాల్పులకు ఒడిగట్టడంతో హోరాహోరీ వాతావరణం నెలకొంది. మరో ఇద్దరు మిలిటెంట్లు ఈ వైమానిక స్థావరంలోనే నక్కినట్లుగా గుర్తించిన సైనికులు వారిలో ఒకడిని అంతమొందించారు. అయితే శనివారం అర్థరాత్రి గాలింపు చర్యల సందర్భంగా జరిగిన బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడి ఎన్‌ఎస్‌జి (నేషనల్ సెక్యూరిటీ గార్డు) దళానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్, మరో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతిచెందడంతో మొత్తం సైనిక మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. మరోపక్క పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కర్నాటకలో రెండు రోజుల పర్యటనను ముగించుకుని ప్రధాని ఢిల్లీ చేరుకున్న వెంటనే రక్షణ మంత్రి పారికర్ ఆయనకు తాజా పరిస్థితిని వివరించారు.
ఇదిలావుంటే, ఎన్‌ఎస్‌జి బాంబు నిర్వీర్య దళంలో పనిచేస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ (కేరళవాసి) గాలింపు చర్యల్లో భాగంగా మృతిచెందిన ఒక ఉగ్రవాది నుంచి గ్రెనేడ్‌ను స్వాధీనం చేసుకుంటుండగా అది పేలింది. దీంతో తీవ్రంగా గాయపడిన నిరంజన్, డిఎస్‌సి (డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్)కి చెందిన మరో ముగ్గరు భద్రతా సిబ్బంది పఠాన్‌కోట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున ప్రాణాలు విడిచారు. వైమానిక స్థావరంలో శనివారం ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో పాకిస్తాన్‌కు చెందిన నలుగురు ముష్కరులు హతమవగా, డిఎస్‌కి చెందిన గార్డు కమెండో, మరో ఇద్దరు సభ్యులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం సైనిక మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది.
అయితే వైమానిక స్థావరంలోని రెండు వేర్వేరు ప్రదేశాల నుంచి ఇప్పటికీ కాల్పులు జరుగుతున్నాయని, కనుక అక్కడ కనీసం మరో ఇద్దరు ఉగ్రవాదులు నక్కినట్లు స్పష్టమవుతోందని, ఈ ఆపరేషన్ పూర్తయితే గానీ అక్కడ ఎంతమంది ముష్కరులు ఉన్నదీ కచ్చితంగా చెప్పలేమని కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో తెలిపారు.

చిత్రం...1. ఎయర్‌బేస్‌లో మిలిటెంట్ల కోసం గాలింపు

2. పఠాన్‌కోట్‌పై హెలీకాప్టర్ పహారా