జాతీయ వార్తలు

అత్యాచార బాధితులకు పరిహారం ప్రభుత్వ బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, మార్చి 1: అత్యాచార బాధితులు బిచ్చగాళ్లు కారని, వారికి పరిహారం ఇవ్వటం ప్రభుత్వ బాధ్యతే తప్ప ఏ చారిటీదో కాదని బాంబే హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది. పధ్నాలుగేళ్ల ఓ అత్యాచార బాధితురాలు తనకు మహారాష్ట్ర ప్రభుత్వ పథకం మనోధైర్య యోజన కింద మూడు లక్షల రూపాయల పరిహారం ఇప్పించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మంజుల చెల్లూరు, జస్టిస్ జి ఎస్ కులకర్ణిలతో కూడిన ధర్మాసనం మహారాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుపట్టింది. బాధితురాలిని ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి వెళ్లిపోయాడు. బాధితురాలికి నిరుడు అక్టోబర్‌లో లక్ష రూపాయలు పరిహారంగా అందించింది. ఈ ఘటన ఇరువురి ఇష్టంతోనే జరిగిందని, అందువల్ల బాధితురాలికి రూ.2లక్షలకు మించి పరిహారాన్ని ఇవ్వజాలమని మహారాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ‘ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం చూస్తున్న దృష్టి కోణం ఎంతమాత్రం సమంజసం అనిపించటం లేదు. ఇది మనసుతో, ఆత్మతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి కేసుల్లో సున్నితత్వం లేకుండా వ్యవహరించటం మంచిది కాదు. ఇలాంటి బాధితులను ఆదుకోవటం ప్రభుత్వ బాధ్యత. వాళ్లు బిచ్చగాళ్లు కారు. పరిహారం పొందటం అనేది వారి హక్కు’ అని ప్రధాన న్యాయమూర్తి మంజుల వ్యాఖ్యానించారు.