జాతీయ వార్తలు

ముస్లింలను మరచిన బిజెపి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మార్చి 1: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ముస్లిం నేతకు కూడా టిక్కెట్ ఇవ్వకపోవటం ద్వారా భారతీయ జనతా పార్టీ తప్పటడుగు వేసిందా? పార్టీ సీనియర్ నేతలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత అయిదేళ్లలో పార్టీ మైనార్టీ సెల్ విభాగం ముస్లింలను దగ్గర చేసుకోవటానికి నిరంతరం పనిచేసింది. ముస్లిం ఓటర్లతో, మత పెద్దలతో, నాయకులతో సత్సంబంధాలు నెరిపింది. తీరా టిక్కెట్లు ఇచ్చే సమయానికి సీన్ రివర్స్ అయింది. 403 స్థానాల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా ముస్లింకు ఇవ్వలేదు. పార్టీ అతివాద ఎంపి వినయ్ కటియార్ అధిష్ఠానం నిర్ణయాన్ని సమర్థించారు. ముస్లింలకు టిక్కెట్ ఇవ్వాల్సిన అవసరమే లేదన్నట్లుగా మాట్లాడారు. కానీ, కేంద్ర హోం మంత్రి, యూపి మాజీ ముఖ్యమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, మరో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉమాభారతి, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీలు మైనార్టీలను పూర్తిగా నిర్లక్ష్యం చేయటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ముస్లింలకు టిక్కెట్లు ఇవ్వకపోవటం ద్వారా తమ పార్టీ తప్పు చేసిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ముస్లింలకు టిక్కెట్లు ఇవ్వకపోవటం పట్ల నేను బాధ పడుతున్నాను. నేను పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ వౌర్యలతో మాట్లాడాను’ అని ఆమె అన్నారు. అంతకుముందు రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ ముస్లింలకు టిక్కెట్లు ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. మరో మంత్రి నఖ్వీ మాట్లాడుతూ ‘టిక్కెట్ల పంపిణీకి సంబంధించినంత వరకు ముస్లింలకు టిక్కెట్లు ఇవ్వవలసి ఉంది. ఇప్పుడు వారి ఆందోళనను పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత వారికి ఏ విధంగా ప్రాధాన్యం ఇవ్వాలో అలా చేస్తుంది’ అని అన్నారు.