జాతీయ వార్తలు

ఇప్పుడేం చెబుతారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహరాజ్‌గంజ్/దేవోరియా, మార్చి 1: పెద్దనోట్ల రద్దుపై నానా రాద్ధాంతం చేసిన ఆర్థికవేత్తలు తాజా జిడిపి నివేదికకు ఏం సమాధానం చెబుతారని ప్రధాని నరేంద్ర మోదీ నిలదీశారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దు ప్రభావం జిడిపిపై ఏమాత్రం లేదని తాజా గణాంకాల్లో తేలిపోయిందని బుధవారం ఇక్కడ చెప్పారు. హార్డ్‌వర్క్ హార్వర్డ్ కంటే శక్తివంతమైందని మోదీ అన్నారు. హార్వర్డ్ ఆర్థికవేత్త పెద్దనోట్ల రద్దును విమర్శిస్తే ఓ పేదవాని కొడుకు దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం చేశాడని మోదీ వ్యాఖ్యానించారు. మహరాజ్‌గంజ్ ఎన్నికల సభలో మాట్లాడిన మోదీ కష్టించి పనిచేయడం కంటే గొప్పది మరేదీ లేదని అన్నారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్‌ను ఉద్దేశించి మోదీ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్దనోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సేన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. 2016-17 సంవత్సరానికి సంబంధించి మూడో త్రైమాసకంలో భారత జిడిపి వృద్ధి రేటు 7 శాతంగా నమోదైన విషయాని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2016 అక్టోబర్-డిసెంబర్‌కు సంబంధించి చైనా సాధించింది 6.8 శాతమేనని నివేదిక పేర్కొంది.
చైనాను అధిగమించి ప్రపంచంలోనే భారత్ వృద్ధిరేటు వేగంగా పెరుగుతోందని తెలిపారు. యూపీలో ఇప్పటి వరకూ జరిగిన ఐదు దశల పోలింగ్ సరళి బిజెపికి అనుకూలంగానే ఉందని ప్రధాని స్పష్టం చేశారు. బిజెపి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆరు, ఏడో విడత పోలింగ్ తమకు బోనస్ అని ఆయన అన్నారు. ఓటర్లు విచక్షణతో ఆలోచించి బిజెపికి మద్దతు ఇవ్వాలని మోదీ అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రధాని నిప్పులు చెరిగారు. కొబ్బరి జ్యూస్, పొటాటో ఫ్యాక్టరీ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను మోదీ ఎద్దేవా చేశారు. మణిపూర్‌లో కొబ్బరిచెట్లు పెరగవు అన్న సంగతి కాంగ్రెస్ నేతకు తెలియకపోవడం సిగ్గుచేటని అన్నారు. మణిపూర్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ మాట్లాడుతూ మణిపూర్ నుంచి కొబ్బరిజ్యూస్ లండన్ లాంటి విదేశీ నగరాలకు ఎగుమతి కావాలని ఆశిస్తున్నానని అన్నారు.
మెజారిటీపై పూర్తి ధీమా
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బిజెపికి పూర్తి అనుకూలంగా వస్తాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అయితే తమకు విజయం విషయంలో ఎలాంటి అనుమానాలు లేకపోయినా మెజారిటీ ఎంత అనే దానిపైనే చర్చ జరుగుతోందన్నారు. మూడింట రెండొంతుల మెజారిటీయా, నాలుగింట మూడొంతుల మెజారిటీయా అనేది లెక్కతేలాల్సి వుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఎన్నడూ కూడా ఏకపక్షంగా యుపి ఎన్నికలు జరగలేదని దేవోరియాలో జరిగిన ఎన్నికల సభలో మోదీ అన్నారు. మాయావతి, అఖిలేశ్, రాహుల్ గాంధీల పనైపోయిందని, అందరూ ఈ ఎన్నికల ఫలితాల్లో కొట్టుకుపోతారని మోదీ పేర్కొన్నారు.