జాతీయ వార్తలు

దద్దరిల్లిన బిహార్ అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, మార్చి 1: పెద్దనోట్లను రద్దుచేసిన ప్రధాని నరేంద్ర మోదీని జనం చెప్పులతో కొట్టాలని మంత్రి చేసిన వ్యాఖలు బిహార్ అసెంబ్లీని కుదిపేశాయి. కాంగ్రెస్ మంత్రి ఇస్తేర్ అబ్దుల్ జలీల్ మస్తాన్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని బిజెపి సభ్యులు డిమాండ్ చేశారు. మస్తాన్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని సభలో నిరసన తెలిపారు. మంగళవారం స్థానిక టీవీలో ప్రధాని మోదీపై మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. మస్తాన్, కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై విచారం వ్యక్తం చేశాయి. అయినా సంతృప్తి చెందని బిజెపి సభ్యులు విధానసభ, విధాన మండలిలో తీవ్ర నిరసన తెలిపారు. సభా కార్యక్రమాలు జరగకుండా అడ్డుకున్నారు. దీంతో రెండు సభలూ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. పూర్నియా జిల్లా అవౌర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఫిబ్రవరి 22న పెద్దనోట్ల రద్దుకు నిరసనగా జరిగిన కార్యక్రమంలో మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎక్సయిజ్, ప్రొహిబిషన్ మంత్రి మస్తాన్ ప్రధాని మోదీ చిత్రపటం చూపిస్తూ చెప్పుతో కొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓ కుర్చీలో ఉంచిన మోదీ చిత్రపటంపై మంత్రి మద్దతుదారులు కొందరు చెప్పులు విసిరారు. మంత్రి తీరుపై బిజెపి సీనియర్ నేత సుశీల్ మోదీ తప్పుపట్టారు. తక్షణం అతడిని మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
మరోపక్క మస్తాన్ వ్యాఖ్యలను పిసిసి అధ్యక్షుడు, మంత్రి అశోక్ చౌదరి తీవ్రంగా ఖండించారు. రాజ్యంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పారు. మస్తాన్‌ను వెంటబెట్టుకొచ్చిన చౌదరి జరిగిన దానికి చింతిస్తున్నామని అన్నారు. మంత్రి కూడా తన వ్యాఖ్యలు బాధించినందుకు చింతిస్తున్నానని అన్నారు. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత ప్రేమ్‌కుమార్ ఈ అంశాన్ని లేవనెత్తారు. మంత్రిని బర్తరఫ్ చేయాలంటూ బిజెపి సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. అనేకసార్లు సభ వాయిదా పడింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శరవణ్‌కుమార్, జెడియు నేత శ్యాం రజక్ మంత్రి తీరును తప్పుపట్టారు. స్పీకర్ విజయ్‌కుమార్ చౌదరి కూడా మస్తాన్ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు.