జాతీయ వార్తలు

కనీస నగదు నిల్వ లేకుంటే రూ.100 పెనాల్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 5: ఇకపై దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు లావాదేవీలు జరిపేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే ఎడాపెడా చార్జీల వడ్డన జరిగిపోతుంది. ఎటిఎంలతో సహా దాదాపుగా అన్ని రకాల ప్రధాన సేవల చార్జీలను సవరిస్తూ ఎస్‌బిఐ నిర్ణయం తీసుకుంది. దాదాపు అయిదేళ్ల తర్వాత ఖాతాదారులు తమ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ను కొనసాగించని పక్షంలో పెనాల్టీని తిరిగి విధించాలని నిర్ణయించింది. అంతేకాదు ఇకపై ఖాతాదారులు నెలకు మూడు సార్లు మాత్రమే ఉచితంగా తమ ఖాతాల్లో నగదు డిపాజిట్ చేయడానికి అనుమతిస్తారు. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి సేవా రుసుముతో పాటుగా రూ. 50 చార్జి వసూలు చేస్తారు. ఏప్రిల్ 1నుంచి కొత్త చార్జీలు అమలులోకి వస్తాయని ఎస్‌బిఐ ప్రకటించింది. సవరించిన కొత్త చార్జీల ప్రకారం ఖాతాల్లో కనీస నగదు నిల్వ (రూ.5000) కొనసాగించని పక్షంలో వందరూపాయల దాకా పెనాల్టీతో పాటుగా సర్వీస్ చార్జి వసూలు చేస్తారు. మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో ఖాతాలో నగదు కనీస నగదు నిల్వలో 75 శాతంకన్నా తక్కువకు పడిపోతే సేవా రుసుముతో పాటుగా వంద రూపాయలు పెనాల్టీ వసూలు చేస్తారు. ఒక వేళ ఈ మొత్తం కనీస నగదు నిల్వకన్నా 50 శాతం తక్కువకు చేరుకుంటే రూ.50తో పాటుగా సేవా రుసుము విధిస్తారు. బ్యాంక్ ఉన్న ప్రాంతాన్ని బట్టి చార్జీలు, కనీస నగదు నిల్వ మొత్తాలు మారుతాయి. ఒక వేళ గ్రామీణ శాఖల్లో అయితే ఇది కనీస మొత్తంగా ఉంటుంది. అదే కరెంట్ ఖాతాలకయితే కనీస నగదు నిల్వ రూ. 20 వేలు. కొత్త కస్టమర్లను సంపాదించుకోవడం కోసం ఎస్‌బిఐ 2012లో కనీస నగదు నిల్వల నిబంధన ఉల్లంఘనలపై చార్జీలు వసూలు చేయడాన్ని రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ ఆ నిబంధనను ప్రవేశపెడుతోంది. ఎస్‌బిఐ ఎటిఎంలనుంచి విత్‌డ్రాలు నెలలో అయిదు సార్లకు మించితే ప్రతి విత్‌డ్రాకు రూ 10 చార్జి చేస్తారు. అదే ఇతర బ్యాంక్ ఎటిఎంలనుంచి అయితే రూ.20 చొప్పున చార్జి చేస్తారు. అయితే ఖాతాలో నగదు నిల్వ రూ. 25 వేలకు మించి ఉన్నట్లయితే ఎస్‌బిఐ ఎటిఎంలనుంచి విత్‌డ్రాలకు ఎలాంటి చార్జి వసూలు చేయరు. ఒక వేళ ఇతర బ్యాంకుల ఎటిఎంల విషయంలోనైతే నగదు నిల్వ లక్ష రూపాయలకు మించి ఉండాలి. డెబిట్ కార్డులు కలిగి ఉన్న వారు మూడు నెలల్లో సగటు నగదు నిల్వను 25 వేలు కొనసాగించిన పక్షంలో ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లకు వారినుంచి రూ.15 వసూలు చేస్తారు. వెయ్యి రూపాయల వరకు యుపిఐ/ యుఎస్‌ఎస్‌డి లావాదేవీలకు ఎలాంటి చార్జి వసూలు చేయరు.