జాతీయ వార్తలు

రైతుల అవస్థలు పట్టని కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోనేభద్ర, మార్చి 5: రైతుల రుణాలను మాఫీ చేశామంటూ కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ చెప్పుకోవడంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు. దేశంలో 50 మంది సంపన్నులకు సంబంధించిన 1.40 లక్షల కోట్ల రుణాలను మాత్రమే మోదీ సర్కారు మాఫీ చేసిందని, 50వేల కోట్ల రూపాయలున్న పేద రైతుల రుణాలను మాఫీ చేసేందుకు నిరాకరించిందని ఆదివారం నాడిక్కడ జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో రాహుల్ అన్నారు. రుణకూపంలో చిక్కుకున్న రైతుల అవస్థలను తాను స్వయంగా చూశానని, రైతుల రుణాలను కూడా మాఫీ చేయాలని దాన కర్ణుడైన ప్రధాని స్వయంగా కోరానని గుర్తుచేశారు. కాని అందుకు ఆయన ఎంతమాత్రం అంగీకరించలేదని అన్నారు. అయితే మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యుపిఏ సర్కారు మాత్రం దాదాపు 70వేల కోట్ల రూపాయల మేర రైతుల రుణాలను మాఫీ చేసిందని, ఇంత కీలకమైన నిర్ణయాన్ని అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే తీసుకుందని రాహుల్ తెలిపారు. తాను అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యను తీరుస్తానని చెప్పిన మోదీ, ఇప్పటివరకూ సాధించింది ఏమిటని ప్రశ్నించారు. ఆయన అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటినా నిరుద్యోగం ఇప్పటికీ ఓ పెద్ద సవాలుగానే ఉందని రాహుల్ అన్నారు. అలాగే ఏటా రెండు కోట్ల మంది యువకులకు ఉపాధి కల్పిస్తానని మోదీ హామీ కూడా నెరవేరలేదని తెలిపారు. నెలల తరబడి కష్టపడి వ్యవసాయం చేసిన పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేక రైతులు నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారని, రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ఈ పరిస్థితిని చక్కదిద్దుతామని, రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. దేశంలో అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌ను కాంగ్రెస్-ఎస్పీ కూటమి మాత్రమే అభివృద్ధి చేయగలదని తెలిపారు. తమకు పట్టం కడితే ఐదు మహిళా వర్సిటీలను ఏర్పాటు చేస్తామని, పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచితంగానే శిక్షణ ఇప్పిస్తామని, రైతుల రుణాలను మాఫీ చేస్తామని, ప్రభుత్వ స్కూళ్లలో జరిగే విద్యార్థులకు నెలకు ఐదు వందల రూపాయల భృతిని అందిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. 12వ తరగతి ఉత్తీర్ణులైన వారికి 30వేల రూపాయలు ఇస్తామని తెలిపారు. అలాగే రాష్ట్రం నలుమూలలా మహిళా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తామని, పోలీసు నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.