జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ .. ఒక జవాను, ఇద్దరు మిలిటెంట్లు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మార్చి 5: జమ్మూ, కాశ్మీర్‌లోని ఫుల్వామా జిల్లా ట్రాల్ అటవీ ప్రాంతంలో ఆదివారం భద్రతా దళాలకు, మిలిటెంట్లకు మధ్య జరిగిన భీకర పోరులో ఇద్దరు మిలిటెంట్లు, ఒక జవాను మృతి చెందగా, ఒక ఆర్మీ మేజర్ గాయపడ్డాడు. నిన్న రాత్రి 7 గంటలకు మొదలైన కాల్పులు దాదాపు 12 గంటల పాటు ఈ రోజు ఉదయం ఆరున్నర దాకా కొనసాగాయి. చనిపోయిన ఇద్దరు మిలిటెంట్లలో ఒకరిని హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఆఖిబ్ భట్‌గా గుర్తించారు. ఆఖిబ్ వౌల్విగా చివరపరిచితుడైన ఇతను మూడు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో చురుగ్గా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. మరొకరిని జైషే మహమ్మద్ తరఫున పని చేస్తున్న పాకిస్తానీ టెర్రరిస్టు సైఫుల్లా అలియాస్ ఒసామా అని అధికార వర్గాలు తెలిపాయి. మిలిటెంట్లతో ముఖాముఖి తలపడిన పోలీసు కానిస్టేబుల్ మన్జూర్ అహ్మద్ నాయక్ కూడా ఈ కాల్పుల్లో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. భద్రతా దళాల చక్రబంధంలో చిక్కుకున్న భట్ ఈ రోజు తెల్లవారుజామున తన తండ్రికి ఫోన్ చేసి తుది వీడ్కోలు చెప్పినట్లు వారు తెలిపారు. భట్ స్థానికుడని, అతని పూర్వీకుల నివాసం ట్రాల్ ప్రాంతంలోని హేనాలోనే ఉందని కూడా వారు చెప్పారు. ఒక కార్పెంటర్ ఇంట్లో ఇద్దరు మిలిటెంట్లు ఉన్నట్లు భద్రతా దళాలకు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు, సైన్యం, సిఆర్‌పిఎఫ్ బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. రాత్రి ఏడు గంటల సమయంలో మిలిటెంట్లకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు మొదలుకాగా రాత్రంతా కూడా ఆడపాదడపా కాల్పులు కొనసాగాయి. కాగా, ఇంట్లో చిక్కుపడిన మిలిటెంట్లను తప్పించేందుకు జనం భద్రతా దళాలపై రాళ్ల వర్షం కురిపించారు కానీ పోలీసులు, సిఆర్‌పిఎఫ్ జనాన్ని తరిమి కొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని అధికారులు చెప్పారు. భద్రతా దళాలతో జరిగిన గొడవల్లో కొంతమంది దుండగులు ఒక సిఆర్‌పిఎఫ్ అధికారివద్దనుంచి ఇన్సాస్ రైఫిల్‌ను లాక్కు పోయారు. ఆర్ రేషి అనే ఆర్మీ మేజర్‌కు బులెట్ గాయాలు కాగా, ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

చిత్రం... మిలిటెంట్ల కాల్పుల్లో మృతిచెందిన జవాను మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న కాశ్మీర్ మంత్రి సయ్యద్ అల్తాఫ్ ముఖారి