జాతీయ వార్తలు

మిలిటరీ ఆస్పత్రిపై ఉగ్ర దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, మార్చి 8: అఫ్గానిస్తాన్‌లోని కాబూల్‌లో గల ఒక మిలిటరీ ఆసుపత్రిపై బుధవారం తిరుగుబాటుదారులు విరుచుకుపడ్డారు. ఉగ్రవాదుల కాల్పులు, పేలుళ్లతో సర్దార్ దావూద్ ఖాన్ ఆసుపత్రి ప్రాంగణం దద్దరిల్లింది. డాక్టర్ల దుస్తులు ధరించి వచ్చిన ఉగ్రవాదులు దేశంలోనే అతిపెద్ద మిలిటరీ ఆసుపత్రిపై దాడికి ఒడిగట్టారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో 30 మంది మృతి చెందారు. ఈ దాడికి తామే పాల్పడ్డామని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. అయితే, తాలిబన్ ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్టు అధికారులు భావిస్తున్నారు. ఉగ్రవాదులు ఆసుపత్రిలోకి చొరబడిన తరువాత అందులో ఉన్న వైద్య సిబ్బంది తమను ఆదుకోవలసిందిగా సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పోస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ‘దుండగులు ఆసుపత్రి లోపల ఉన్నారు. మాకోసం ప్రార్థించండి’ అని ఆసుపత్రిలోని ఒక ఉద్యోగి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన సందేశంలో అర్థించాడు. ఆసుపత్రిలో మొదటి పేలుడు సంభవించిన తరువాత ముగ్గురు సాయుధులు లేబొరేటరి కోట్లు ధరించి ఉండటం కనిపించిందని ఆసుపత్రి పరిపాలనాధికారులు ఒక వార్తాసంస్థకు చెప్పారు. 400 పడకలున్న ఈ ఆసుపత్రిలో మొదటి పేలుడు తరువాత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, తరువాత సాయుధ తిరుగుబాటుదారులు ఎక్కడపడితే అక్కడ విచక్షణారహితంగా కాల్పులు జరిపారని అబ్దుల్ హకీం అనే అధికారి ఎఎఫ్‌పి వార్తాసంస్థకు ఫోన్‌లో చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పి, ఆయన హడావుడిగా ఫోన్ పెట్టేశారు. మొదటి పేలుడు తరువాత కొద్ది సేపటికి మరో రెండు పెద్ద పేలుళ్లు సంభవించాయి. ‘ఇది నేరపూరిత చర్య. ఆసుపత్రిపై దాడిని ఎవరూ సమర్థించుకోజాలరు’ అని అఫ్గాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అబ్దుల్లా అబ్దుల్లా అన్నారు. ఈ నేరగాళ్లను తాము ఎన్నటికీ వదలిపెట్టబోమని ఆయన పేర్కొన్నారు.

చిత్రం... దాడి ప్రాంతాన్ని పరిశీలిస్తున్న
అఫ్గాన్ భద్రతా దళాలు