అంతర్జాతీయం

చర్చల పునరుద్ధరణకు సవాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జనవరి 3: భారత్, పాకిస్తాన్ నాయకుల మధ్య ఇటీవల జరిగిన సమావేశాల సుహృద్భావం ఏర్పడినప్పటికీ పఠాన్‌కోట్‌లో భారత వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడి ఇరు దేశాల మధ్య చర్చల పునరుద్ధరణకు జరుగుతున్న ప్రయత్నాలకు ముప్పు కలిగించవచ్చని పాక్ ప్రచార మాధ్యమాలు ఆదివారం పేర్కొన్నాయి. ‘్భరత వైమానిక స్థావరంపై సాయుధ దుండగుల దాడి’ అనే శీర్షికతో తొలిపేజీలో వార్తా కథనాన్ని ప్రచురించిన ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక, ఈ దాడి ముగిసినప్పటికీ అది ఇరు దేశాల మధ్య చర్చల పునరుద్ధరణకు జరుగుతున్న ప్రయత్నాలకు సవాలు విసురుతుందని స్పష్టం చేసింది. ద్వైపాక్షిక చర్చలను పునరుద్ధరించే ప్రయత్నంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో ఆకస్మిక భేటీ జరిపిన వారం రోజులకే పఠాన్‌కోట్‌లోని కీలక వైమానిక స్థావరంపై దాడి జరిగిందని ‘న్యూస్ ఇంటర్నేషనల్’ పత్రిక పేర్కొంది. భారత్, పాక్ మధ్య చర్చల పునరుద్ధరణకు గతంలో జరిగిన ప్రయత్నాలు కూడా ఇదేవిధమైన ఘటనల వల్ల పట్టాలు తప్పాయని, అయితే ప్రస్తుతం జరిగిన దాడిని పాక్ అధికారులు ఖండించినందున ఇరు దేశాల మధ్య తాజాగా జరుగుతున్న సంప్రదింపులు ముందుకు సాగవచ్చని ఆ పత్రిక అభిప్రాయపడింది. కాగా, పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్ నుంచి వచ్చిన సంకేతాలను చూస్తుంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా భారత్, పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శుల చర్చలు ముందుకు సాగుతాయని స్పష్టమవుతోందని, అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న వాతావరణంపై ఈ దాడి ఎంతోకొంత దుష్ప్రభావాన్ని చూపుతుందని మరో పత్రిక ‘డాన్’ స్పష్టం చేసింది. పఠాన్‌కోట్‌లో దాడి ఘటనపై విదేశాంగ కార్యదర్శుల సమావేశానికి ముందే ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేయాలని భారత్ భావిస్తోందని, విదేశాంగ కార్యదర్శుల చర్చల్లో భారత్ అనుసరించే వైఖరి ఈ దర్యాప్తులో వెల్లడైన విషయాలపైనే ఆధారపడి ఉంటుందని ఆ పత్రిక పేర్కొంది.