అంతర్జాతీయం

దాడులకు కుట్రపన్నిన ఎన్నారైకి 15 ఏళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మార్చి 8: భారత్‌పై ఉగ్రదాడులకు కుట్ర పన్నాడన్న అభియోగంపై 42 ఏళ్ల ఎన్నారైకు అమెరికా కోర్టు 15 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఖలిస్తాన్ ఉద్యమం సందర్భంగా సహాయ, సహకారాలు అందించినట్టు బల్వీందర్‌సింగ్‌పై అభియోగం. యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లారే హీక్స్ 180 నెలలు జైలుశిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చారని అటార్నీ డేనియల్ బోగ్డెన్ వెల్లడించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు తప్పవని చెప్పడానికి ఇదో ఉదాహరణగా ఆయన అభివర్ణించారు. సింగ్‌ను గత ఏడాది నవంబర్‌లోనే కోర్టు దోషిగా నిర్ధారించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2013 సెప్టెంబర్, డిసెంబర్ మధ్యలో భారత్‌పై దాడికి ప్రయత్నించాడు. పంజాబ్‌ను సిక్కు దేశంగా చేయాలన్న ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతుగా సహాయ సహకారాలు అందజేశాడు. నిధుల సేకరణ, పేలుడు పదార్థాలు సమకూర్చడం వంటి చర్యలకు పాల్పడినట్టు బల్వీందర్‌సింగ్‌పై అభియోగాలు. దీనికోసం ఓ కుట్రదారుడిని కలిసేందుకు రెనో నుంచి కాలిఫోర్నియా ప్రయాణం చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది.