జాతీయ వార్తలు

నారీ శక్తికి జేజేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధికి, ప్రగతికి మహిళలు అమూల్యమైన సేవలు అందించారని రాష్టప్రతి ట్విట్టర్‌లో అన్నారు. అంతేకాక స్ర్తిపురుష సమానత్వానికి, నిజమైన మహిళా సాధికారికతకోసం పునరంకితం కావాలని ఆయన ఈ సందర్భంగా దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు అభినందనలు తెలియజేశారు. నారీశక్తి అచంచలమైన ఆత్మస్థైర్యం, దృఢదీక్ష, అంకితభావంతో ముందుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. వారికోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను చేపట్టిందని తెలిపారు. ‘నారీశక్తి (మహిళల) ఆర్థిక సాధికారికత, స్వావలంబన, సామాజిక సమానత్వంకోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటోంది’ అని ప్రధాని తన ట్విట్టర్ ఖాతాలో ఉంచిన సందేశంలో పేర్కొన్నారు.
మహిళలకు సాధికారికత కల్పించనిదే మానవాళి పురోగతి అసంపూర్తిగానే ఉంటుందని, ఇప్పుడు సమస్య మహిళల అభివృద్ధి ఎంతమాత్రం కాదని, మహిళల నేతృత్వంలో అభివృద్ధి అని అన్నారు. మహిళల మద్దతుకోసం ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలను ఆయన ఉదహరిస్తూ, వేడుకల సమయంలో మహిళలకు కానుకలు ఇచ్చే బదులు ఇలాంటి పథకాలను బహుమతిగా ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని ప్రజలను కోరారు. మహిళలకు సహాయపడేందుకు జిపిఎస్‌లాంటి వాటితోపాటుగా తక్షణ సహాయం కోరడంకోసం స్మార్ట్ఫోన్లలో పానిక్ బటన్ సదుపాయం కల్పించే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. పథకం ప్రకారం ప్రసూతి సదుపాయాలు ప్రతి తల్లికి చేరేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించుకొందని, బిడ్డను ప్రసవించిన వెంటనే ప్రతి తల్లికీ రూ.6 వేల ఆర్థిక సహాయం లభిస్తుందని ఆయన తెలిపారు. ప్రసవించిన తర్వాత బాలింతల్లో పోషకాహర లోపం లేకుండా చూడడం, రాబోయే తరాల ఆరోగ్యాలపైన సానుకూల ప్రభావం చూపించేలా చూడడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. గర్భిణీలకు ఉచిత ఆరోగ్య పరీక్షలకోసం ప్రతి నెలా 9వ తేదీని నిర్ణయించినట్లు కూడా ఆయన తెలిపారు.
మహిళలకు ఉపాధి అవకాశాలు లభించేలా చూసేందుకు, పని చేసేచోట అనువైన వాతావరణం ఉండేలా చూడడానికి మాతృత్వం, సంరక్షకుల కెరీర్ అవకాశాలు పరస్పరం దెబ్బతినకుండా చూడడానికి, మహిళలు సమాజానికి విలువైన సేవలు అందించేలా చూసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని ఆ సందేశంలో పేర్కొన్నారు. రకరకాల బాధ్యతలను నిర్వహించే విషయంలో మహిళలకు ఎవరు కూడా సాటి రారని, అందుకు మనమంతా గర్వించాలన్నారు. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ, ఈ కార్యక్రమం తర్వాత మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉండే హర్యానాలాంటి రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో స్ర్తిపురుష నిష్పత్తిలో గణనీయమైన మెరుగుదల ఉందని ప్రధాని చెప్పారు. ఇది ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమంగా కాక ప్రజల ఉద్యమంగా మారిందని ఆయన అన్నారు.

2016 సంవత్సరానికి గాను నారీ శక్తి పురస్కారాలను రాష్టప్రతి బుధవారం అందజేశారు. అవార్డు అందుకున్న మోటారుసైకిలిస్టు పల్లవి ఫాజ్‌దార్